Telugu News Trending The video of Burning camphor falling on the head has gone viral on social media Telugu news
Video Viral: ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు
కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు లేదా గృహ ప్రవేశ కార్యక్రమంలో మొదట పూజ చేసి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లడం ఆనవాయితీ. గేటు ముందు నిలబడి గుమ్మడి కాయతో హారతి ఇచ్చే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది....
కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు లేదా గృహ ప్రవేశ కార్యక్రమంలో మొదట పూజ చేసి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లడం ఆనవాయితీ. గేటు ముందు నిలబడి గుమ్మడి కాయతో హారతి ఇచ్చే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ (Mobile Phone), ఇంటర్నెట్ చేరింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో వీడియోలు పంచుకుంటున్నారు. ఇవి అప్పటికప్పుడు వైరల్ గా అవుతుంటాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని వీడియోలు చూస్తే నవ్వు వస్తుంది. మరికొన్నింటిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటికి పూజలు చేయడాన్ని చూడవచ్చు. దిష్టి తీసే గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు. అనంతరం దానిని పగలగొట్టడానికి నేలపై బలంగా కొట్టాడు. అయితే ఆ సమయంలో గుమ్మడికాయ నేలపై పడిపోగా.. కర్పూరం ఆయన తలపై పడిపోయింది. ఆయన వెంటనే అప్రమత్తమై వెంటనే దానిని తొలగిస్తాడు. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు 75 వేలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ‘పద్ధతి తప్పు అయినప్పుడు ఫలితం కూడా తప్పుగా ఉంటుంది’ అని, ‘జోష్, ఉత్సాహం కొన్నిసార్లు పెద్ద తప్పులు చేస్తాయి.’ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.