AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tower of London: వెయ్యేళ్ల కోటకు సంరక్షకులు కాకులే .. వాటి రక్షణ కోసం కేర్ టేకర్..

థేమ్స్‌ నది తీరంలో ఉన్న వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌‘కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే 56 ఏళ్ల మైకేల్‌. రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడైన మైకేల్‌ ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది పని చేస్తారు.

Tower of London: వెయ్యేళ్ల కోటకు సంరక్షకులు కాకులే .. వాటి రక్షణ కోసం కేర్ టేకర్..
Tower Of London
Surya Kala
|

Updated on: Mar 02, 2024 | 12:26 PM

Share

కాకులు రక్షణలో అతి పురాతన కోట ఉంది. అదే సమయంలో ఆ కోటని రక్షిస్తున్న కాకుల సంరక్షణ కోసం ఒక వ్యక్తి అధికారికంగా నియమింపబడ్డాడు. లండన్ నగరంలోని థేమ్స్‌ నది తీరంలో ఉన్న వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌‘కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే 56 ఏళ్ల మైకేల్‌. రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడైన మైకేల్‌ ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది పని చేస్తారు.

1066లో ఇంగ్లండ్‌ను జయించిన తర్వాత రాజు విలియం I ఈ కోటను నిర్మించాడు. ఈ కోట అనేక వందల సంవత్సరాలు రాజ నివాసంగా పనిచేసింది.. అనంతరం కాలక్రమంలో ఇది జైలుగా ప్రసిద్ధి చెందింది. 1483లో కింగ్ ఎడ్వర్డ్ IV కుమారులు “టవర్‌లోని రాకుమారులు” నిర్బంధించబడ్డారు. వీరి మామని కింగ్ రిచర్డ్ III హత్య చేశాడు. అంతేకాదు 8వ హెన్రీ తన రెండవ భార్యతో విసిగిపోయిన తర్వాత 1536లో అన్నే బోలీన్‌ను ఉరితీయించాడు. ఇలా ఎంతో చారిత్రాత్మ నేపధ్యం ఉన్న టవర్‌ను సంరక్షణను వదిలివేస్తే.. దీని పక్కన ఉన్న వైట్ టవర్ కూలిపోతుంది, తర్వాత ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందని 7వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ IIకి జోస్యం చెప్పబడింది. అంతేకాదు ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకిలు ఉండాలని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయని స్థానికుల విశ్వాసం. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్‌ టవర్‌తోపాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందని నమ్ముతారు కూడా..

కింగ్‌ ఛార్లెస్‌ – 2 తనకు చెప్పిన జ్యోష్యాన్ని విశ్వసించాడు. ఆ టవర్‌ వద్ద ఎప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్‌ ఛార్లెస్‌ – 3 పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడుగా మార్చారు. ఇప్పుడు కాకుల సంరక్షణ బాధ్యత చేపట్టిన రావెన్‌మాస్టర్ వయసు 50 సంవత్సరాలు మాత్రమే. మిస్టర్ చాండ్లర్ ఈ పదవికి ఆరవ అధికారి. ఇతను సాధారణంగా పగలు టవర్ గ్రౌండ్స్ చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ… రాత్రి బోనులలో నిద్రించే పక్షుల ఆరోగ్యం, సంక్షేమానికి బాధ్యత వహిస్తాడు. పక్షుల ఎన్‌క్లోజర్‌లను నిర్వహించడం, వెటర్నరీ చెకప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కాకులకు ఇష్టమైన పచ్చి మాంసాన్ని ఆహారంలో అందించడం, అప్పుడప్పుడు ఉడికించిన గుడ్డు లేదా రక్తంలో నానబెట్టిన హార్డ్-టాక్ బిస్కెట్‌ను అందించడం వంటి విధులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కోట సంరక్షులుగా నియమించే పక్షులు ఎగిరిపోకుండా ఈకలు కత్తిరించబడతాయి, అయినప్పటికీ అవి అప్పుడప్పుడు తప్పించుకుంటాయి. హిస్టారిక్ రాయల్ ప్యాలెస్‌ల ప్రకారం, టవర్‌ను పర్యవేక్షిస్తోంది స్వచ్ఛంద సంస్థ. గ్రోగ్ అనే కాకి 1981లో ఎగిరింది. చివరిగా రోజ్ అండ్ పంచ్‌బౌల్ అనే ఈస్ట్ ఎండ్ పబ్ వెలుపల కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..