Rude Experience: అదేంటీ.. అడుగడుగునా అవమానించే హోటల్‌కు జనం క్యూ..!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే 20 వేల రూపాయలు చెల్లించాలి. హోటల్‌లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది.
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే 20 వేల రూపాయలు చెల్లించాలి. హోటల్‌లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు ఏం చేయాలో బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే జనం ఇక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

