AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన దేశంలో తొలి సూర్యోదయం ఎక్కడో తెలుసా..? ప్రకృతి ప్రేమికులకు ఇదోక స్వర్గం..!

ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం. మనకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలాంటిదే భారతదేశంలోని ఈ గ్రామం కూడా ఇక్కడ మనం దేశంలోనే తొలి సూర్యోదయాన్ని చూస్తాం. అవును, ఈ గ్రామంలోనే మొదట సూర్యుడు ఉదయిస్తాడు. తిరిగి మధ్యాహ్నం వరకే అస్తమించటంతో అక్కడ అతి తొందరగా రాత్రి అవుతుంది. ఇలాంటి అద్భుతమైన వాతావరణాన్ని చూసేందుకు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు.

మన దేశంలో తొలి సూర్యోదయం ఎక్కడో తెలుసా..? ప్రకృతి ప్రేమికులకు ఇదోక స్వర్గం..!
Earliest Sunrise India
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2025 | 9:14 PM

Share

భారతదేశంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ వాటి ప్రత్యేకతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే, భారతదేశంలో సూర్యుడు మొదట ఎక్కడ ఉదయిస్తాడో మీకు తెలుసా? చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు. ఈశాన్య భారతదేశంలో అలాంటి ఒక గ్రామం ఉంది. ఇక్కడ సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఈ గ్రామం పేరు డోంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ గ్రామం భారతదేశం, చైనా, మయన్మార్‌ల త్రి-జంక్షన్ సమీపంలో ఉంది. ఇక్కడి అందాలను చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు.

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని గోండ్ గ్రామంలో ముందుగా సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ మనం అత్యంత ప్రత్యేకమైన సూర్యోదయాన్ని చూస్తాము. డాంగ్ గ్రామంలో సూర్యోదయం తెల్లవారుజామున 2- 3 గంటల మధ్య జరుగుతుంది. ఇది సాధారణంగా భారతదేశ సమయం కంటే ఒక గంట ముందు జరుగుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇక్కడి అద్భుతమైన సూర్యోదయాన్ని చూడటానికి, పర్యాటకులు సాధారణంగా రాత్రిపూట దట్టమైన అడవులు, నిటారుగా ఉన్న కొండల గుండా నాలుగు నుండి ఐదు కిలోమీటర్లు నడుస్తారు. ఇక్కడ రోడ్లు పరిమితంగా ఉంటాయి. ప్రాథమిక సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇది ప్రకృతి ప్రేమికులకు గొప్ప గమ్యస్థానంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

డాంగ్‌లో సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు. త్వరగా అస్తమిస్తాడు. సూర్యాస్తమయం సాధారణంగా మధ్యాహ్నం 3 లేదా 4 గంటల ప్రాంతంలో జరుగుతుంది. దీని ప్రభావం రోజువారీ జీవితంపై పెద్దగా ఉండదు. నివాసితులు పగటిపూట తమ పనిని ముగించి, మధ్యాహ్నం రాత్రికి వంట చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ మిష్మి తెగ ప్రజలు నివసిస్తుంటారు. వీరి జీవితం ప్రకృతితో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. వారి రోజువారీ కార్యకలాపాలు, పండుగలు, ఆచారాలు సూర్యోదయం, సూర్యాస్తమయంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడి జీవితం మానవులు సహజ వాతావరణానికి ఎలా అనుగుణంగా ఉంటారో చూపిస్తుంది.

డాంగ్ చేరుకోవడం ఎలా?

భారతీయ పర్యాటకులకు డాంగ్ సందర్శించడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. విదేశీ పర్యాటకులకు రక్షిత ప్రాంత పర్మిట్ అవసరం. ఈ గ్రామం భారత-చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున, భారత సైనిక స్థావరాలు ఎక్కువగా ఉంటాయి. సాహసం, ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు. ఈ గ్రామంలో మీరు భారతదేశంలోని మొదటి సూర్యోదయాన్ని ఆస్వాదించడమే కాకుండా, ట్రెక్కింగ్, ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, మిష్మి తెగ సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవచ్చు.

సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ గ్రామం అద్భుతమైన దృశ్యాలు, ప్రత్యేకమైన జీవనశైలితో పర్యాటకులకు, ఫోటోగ్రాఫర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మన దేశం ప్రకృతితో ఎలా అనుసంధానించబడిందో ఇక్కడ మీరు నేర్చుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..