Bizzare Video: వరదలా ప్రవహిస్తున్న ఇసుక.. షాక్‌లో జనాలు.. వైరల్ అవుతున్న వీడియో.!
Sand River Bizzare Video: మీరెప్పుడైనా.. ఇసుక ఓ నదిలా ప్రవహించడం చూశారా.? ఇదేంటి ఇసుకు.. నదిలా ప్రవహించడం ఏంటని షాక్ అవుతున్నారా.?

Sand River Bizzare Video: మీరెప్పుడైనా.. ఇసుక ఓ నదిలా ప్రవహించడం చూశారా.? ఇదేంటి ఇసుకు.. నదిలా ప్రవహించడం ఏంటని షాక్ అవుతున్నారా.? మీరు వినదే నిజమే. ఇసుక నదిలా ప్రవహించే ఘటన ఒకటి సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
మొదట ఈ ప్రవాహాన్ని చూసిన జనాలకు అదేంటో అన్నది అర్ధం కాలేదు. ఇక కొంతమంది అయితే మాత్రం దాని వెనుక ఉన్న రహస్యాన్ని చేధించారు. ఎడారిలో రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తుంది. ఉదయం వేళల్లో ఏర్పడే వేడికి ఆ మంచు కరుగుతుంది. ఎత్తైన ప్రాంతాల్లో కురిసే మంచు గుండ్రని ఐస్ ముక్కల్లా మారుతుంది. అవి క్రమేనా కిందకి జారుతాయి. ఇలా వందలు.. వేలు.. లక్షల మంచు ముద్దలు ప్రవాహంలా ఎగువ నుంచి దిగువకు కదులుతాయి.
ఇక అవి ఇసుకను అంటుకుని కదలడం వల్ల చూసేందుకు ఇసుకే ప్రవహిస్తున్నట్లుగా అందరికీ కనిపిస్తుంది. కానీ, అన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పడే అవకాశం లేదట. ఇవి కేవలం ఎడారి లాంటి ప్రదేశాల్లో మాత్రమే సాధ్యమవుతుందని కొందరి భావన. ఈ ఇసుక నదికి సంబంధించిన వీడియో పాతదే అయినా.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Also Read:
Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!
ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!
అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!