తృటిలో సేఫ్ ! కిల్లర్ వేల్ నుంచి తప్పించుకుని డింగీలోకి జంప్ చేసింది, అదీ తెలివంటే…

మరికొన్ని క్షణాల్లో ఆ పెంగ్విన్ పెను తిమింగలానికి (వేల్) కి ఆహారమైపోయేదే ! దాన్ని వేల్ గుటుక్కున మింగేసేదే ! కానీ ఆ చిన్ని పక్షికి పెద్ద తెలివే ఉంది.. అంటార్కిటికా లో సముద్రంలో తన వెంట బడుతున్న....

  • Umakanth Rao
  • Publish Date - 5:30 pm, Mon, 8 March 21
తృటిలో సేఫ్ ! కిల్లర్ వేల్ నుంచి తప్పించుకుని  డింగీలోకి జంప్ చేసింది, అదీ తెలివంటే...

మరికొన్ని క్షణాల్లో ఆ పెంగ్విన్ పెను తిమింగలానికి (వేల్) కి ఆహారమైపోయేదే ! దాన్ని వేల్ గుటుక్కున మింగేసేదే ! కానీ ఆ చిన్ని పక్షికి పెద్ద తెలివే ఉంది.. అంటార్కిటికా లో సముద్రంలో తన వెంట బడుతున్న బ్రహ్మాండమైన తిమింగలం నుంచి తనను రక్షించుకునేందుకు ఆ చిన్నపాటి పెంగ్విన్ నానా పాట్లూ పడుతూ వచ్చింది. అదృష్టవశాత్తూ దానికి కొద్ది దూరంలో కొంతమంది టూరిస్టులతో వస్తున్న డింగీ కనబడింది. అంతే ! అతి వేగంగా ఈదుకుంటూ ఆ డింగీ వద్దకు చేరుకొని కొంత దూరంలో ఉండగానే అందులోకి ఒక్క గెంతున ఎగిరింది. చిన్న డింగీలోని పర్యాటకులు దాన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

మాట్  కార్స్ టెన్, అతని భార్య ‘అన్నా’.. కొంతమంది తమ సహచరులతో కలిసి అంటార్కిటికా కు  సాహస యాత్ర చేస్తుండగా వారికి ఈ విచిత్రమైన అనుభవం కలిగింది.  పదేళ్లుగా తాము ఇలా 40 దేశాలు పర్యటిస్తూ వస్తున్నామని, కానీ ఈ ‘పెంగ్విన్’ అనుభవం వంటిది ఎప్పుడూ కలగలేదని ఈ దంపతులు తెలిపారు. సాధారణంగా పెంగ్విన్ పక్షులు మనుషులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. చాలా త్వరగా మాలిమి అయిపోతాయి. ఇక్కడ తనను తాను తిమింగలం నుంచి కాపాడుకునేందుకు ఈ చిన్న పక్షి ఎంత లాఘవంగా డింగీ లోకి దూకేసిందో వీడియోలో చూడాల్సిందే.
incredible moment penguin escapes killer whale by jumping it self onto a dinghy, antarctica, penguin, killer whale, save, jump, dinghy, tourists

మరిన్ని చదవండి ఇక్కడ :

నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న తెలుగు తేజం పి .వి సింధు.

48 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చిన 10 సెకన్ల వీడియో..ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.