అనారోగ్యంతో తల్లి మృతి.. గుట్టుచప్పుడు కాకుండా 14ఏళ్ల కొడుకు చేసిన పనితో ఊరంతా షాక్..!

తల్లి చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. ఏకంగా మృతదేహంతో ఆమె 14 ఏళ్ల కుమారుడు నాలుగు రోజులు గడిపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

అనారోగ్యంతో తల్లి మృతి.. గుట్టుచప్పుడు కాకుండా 14ఏళ్ల కొడుకు చేసిన పనితో ఊరంతా షాక్..!
Representative Image
Follow us

|

Updated on: Aug 03, 2024 | 12:26 AM

తన తల్లి చనిపోయిన విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా.. ఆమె మృతదేహంతో నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు 14 ఏళ్ల కొడుకు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. భరించలేని దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల నివసించేవారు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించారు.

వివరాల్లోకెళ్తే.. 44 ఏళ్ల సిల్వియా డేనియల్ అనే మహిళ తన 14 ఏళ్ల కొడుకు ఒల్విన్ డేనియల్‌తో కలిసి థానేలోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. గత కొన్ని నెలలుగా సిల్వియా అరుదైన వ్యాధితో బాధపడుతూ.. కొద్దిరోజుల క్రితమే కన్నుమూసింది. ఇక తన తల్లి చనిపోయిందన్న వార్త.. చుట్టుపక్కల వారికి తెలియకూడదన్న ఉద్దేశంతో 14 ఏళ్ల కొడుకు ఆమె మృతదేహంతో నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన వస్తుండటంతో మిగతా ఫ్లాట్స్‌లో నివాసముంటున్నవారు తలుపులు బద్దలకొట్టి చూడగా.. సిల్వియా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దర్శనమిచ్చింది. దీంతో షాక్ తిన్న అందరూ.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా తన తల్లి చనిపోయిందని మృతురాలు కుమారుడు ఒల్విన్ డేనియల్ పోలీసులకు తెలిపాడు. కుమారుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మహిళ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!