AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాము విషం ఎంత ప్రమాదకరమో తెలుసా..? వెన్నులో వణుకుపుట్టించే వీడియో.. చెమటలు పట్టాల్సిందే..

విష జీవులు..  పాములు చిన్నవా..? లేదా పెద్దవా..? అని కాదు.. సాధారణంగా వాటిని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. ఎందుకంటే పాములు అత్యంత ప్రమాదకరమైన విష జీవులు.. అందుకే పాములకు ఎవరైనా సరే దూరంగా ఉంటారు.. ఎందుకంటే అవి కాటేస్తే.. నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి..

Viral Video: పాము విషం ఎంత ప్రమాదకరమో తెలుసా..? వెన్నులో వణుకుపుట్టించే వీడియో.. చెమటలు పట్టాల్సిందే..
Effects of Snake Venom on Human Blood
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2024 | 4:43 PM

Share

విష జీవులు..  పాములు చిన్నవా..? లేదా పెద్దవా..? అని కాదు.. సాధారణంగా వాటిని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. ఎందుకంటే పాములు అత్యంత ప్రమాదకరమైన విష జీవులు.. అందుకే పాములకు ఎవరైనా సరే దూరంగా ఉంటారు.. ఎందుకంటే అవి కాటేస్తే.. నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి.. అయితే, పాముకాటు వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పాము కాటు తర్వాత దాని విషం మన మనిషి రక్తాన్ని ప్రభావితం చేస్తుంది.. ఆ తర్వాత నెమ్మదిగా విషం శరీరం మొత్తం వ్యాప్తి చెంది గంటల్లోనే మరణానికి కారణమవుతుంది. అయితే… పాము విషం రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న ఓ వైర‌ల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. పాముకాటు మరణానికి ఎలా దారితీస్తుంది.. రక్తం ఎందుకు స్థంభించిపోతుందన్న ఈ వీడియో వణుకుపుట్టిస్తుంది.

ఈ వీడియోలో..ఇద్దరు వ్యక్తులు ఓ పాము నుంచి విషాన్ని కప్పులోకి జాగ్రత్తగా సేకరిస్తారు.. మరొక వ్యక్తి దానిని రికార్డ్ చేస్తూ కనిపించాడు.. విషాన్ని కప్పులోకి సేకరించిన తర్వాత.. ఆ విషాన్ని సిరంజీలోకి తీసుకుంటారు. అనంతరం ఓ డిష్‌ లోకి మానవ రక్తం తీసుకుంటారు.. సీరంజీలోని విషాన్ని రక్తంలో రెండు చుక్కులు వేస్తారు. ఆ వెంటనే.. మానవ రక్తం గడ్డ కట్టి పోతుంది.. ఇలానే పాము కాటు తర్వాత రక్తం గడ్డ కట్టి.. ముఖ్యమైన అవయవాలను నిరోధించడం ద్వారా మరణానికి కారణమవుతుందని విశ్లేషించారు.

వీడియో చూడండి..

పాముకాటుకు మందు ఎలా తయారు చేస్తారంటే..

అయితే.. పాము కాటుకు ముందు కూడా పాము విషం నుంచే తయారు చేస్తారు. పాముకాటుకు చికిత్స.. యాంటీ-వెనమ్స్.. అత్యవసర సమయాల్లో ఇది పాము విషం నుంచి మనిషిని రక్షిస్తుందని అంటున్నారు. యాంటీ వీనమ్ పాము విషంతోనే తయారు చేస్తారు. తొలుత పాము విషం తీసి.. ప్రభావం కోల్పోయేంతగా పలుచగా మార్చుతారు. అనంతరం గొర్రెలు లేదా గుర్రాల వంటి జంతువులు ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా వాటి శరీరంలో పాము విషాన్ని నిర్వీర్యం చేసే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తరువాత ఈ యాంటీ బాడీలను వాటి రక్తం నుంచి వేరు చేసి యాంటీ వెనమ్ తయారు చేస్తారు. ఈ యాంటీ వీనెమ్ లోని యాంటీబాడీలు మనిషి రక్తంలోని విషాన్ని నిర్వీర్యం చేస్తాయి. అయితే, ఇక్కడో సమస్య ఉంది.. యాంటీ-వెనమ్‌లు ఖరీదైనవి.. కొద్ది మంది మాత్రమే వాటిని కొనుగోలు చేయగలరు. అందుకే.. పాము కాటుకు సంబంధించి తగిన చికిత్స అందించేందుకు ప్రభావవంతమైన యాంటీ-వెనమ్‌లను కనుగొనాలంటూ పలువురు వైద్యనిపుణులు సూచనలు కూడా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..