సముద్ర గర్భంలో అరుదైన దృశ్యం.. ఏంటని వెళ్లి చూడగా డైవర్‌కు మిరమిట్లు గొలిపే.!
ఎప్పటిలానే ఆ రోజున కూడా కొందరు స్థానిక వ్యక్తులు సముద్రంలో డైవింగ్ చేసేందుకు దిగారు. డైవ్ చేసుకుంటూ కొద్దిదూరంలో సముద్ర గర్భంలోకి వెళ్లగా.. అక్కడ ఓ వ్యక్తికి అరుదైన అద్భుతం ఒకటి కనిపించింది.
ఎప్పటిలానే ఆ రోజున కూడా కొందరు స్థానిక వ్యక్తులు సముద్రంలో డైవింగ్ చేసేందుకు దిగారు. డైవ్ చేసుకుంటూ కొద్దిదూరంలో సముద్ర గర్భంలోకి వెళ్లగా.. అక్కడ ఓ వ్యక్తికి అరుదైన అద్భుతం ఒకటి కనిపించింది. ఎంతని అతడు దగ్గరకు వెళ్లి చూడగా.. దెబ్బకు స్టన్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే.. కోస్టల్ గార్డ్స్ ఎంట్రీతో మొత్తం విషయం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
వివరాల్లోకెళ్తే.. సార్డినియా ఈశాన్య తీరంలో సుమారు 30 వేల నుంచి 50 వేల పురాతన నాణేలను కనుగొన్నట్టు ఇటలీ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. నాల్గవ శతాబ్దపు కాలం నాటి కాంస్య నాణేలు అర్జాచెనా పట్టణానికి సమీపంలోని మధ్యధరా ద్వీపం తీరానికి కొంచెం దూరంలో సముద్రపు గడ్డిలో ఉన్నట్టు గుర్తించారు అధికారులు. మొదటిసారిగా ఈ అరుదైన అద్భుతాన్ని స్థానికంగా ఉన్న ఓ డైవర్ చూడగా.. ఆ తర్వాత అది కాస్తా వైరల్‌గా మారింది. ఇటలీ ఆర్ట్ ప్రొటెక్షన్ స్క్వాడ్, మంత్రిత్వ శాఖ సముద్రగర్భంలో ఈ పురాతన నాణేలను బయటకు తీసేందుకు పెద్ద ఆపరేషన్ చేశాయి. సముద్రపు గర్భంలోని గడ్డి, బీచ్‌కు మధ్యలో ఉన్న ఇసుక విస్తీర్ణంలో ఈ నాణేలన్నీ ఉన్నాయని.. అలాగే అవి ఉన్న సమీపంలో ఏవో ఓడ ధ్వంసమైన అవశేషాలు కూడా ఉన్నట్టు పురావస్తు అధికారులు గుర్తించారు.
ఎన్ని పురాతన నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారోనన్నది ప్రకటించలేదు గానీ.. కనీసం 30,000 నుంచి 50,000 వరకు ఉండవచ్చునని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అన్ని నాణేలు ఏమాత్రం చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉన్నాయని.. అలాగే వాటిల్లో కొన్ని పాడైపోయిన నాణేలపై కూడా ఇప్పటికీ శాసనాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అర్జాచెనా సముద్ర జలాల్లో కనుగొన్న ఈ నిధి అత్యంత ముఖ్యమైన నాణేల ఆవిష్కరణలలో ఒకటిగా ఉంటుందని తెలిపింది. కాగా, శతాబ్దాలుగా సార్డినియా అండ్ కోర్సికా రోమన్ ప్రావిన్స్‌లో సార్డినియా ఓ భాగమై ఉంది. ఆ తర్వాత 7వ శతాబ్దంలో ఇటాలియా సబర్బికేరియా డియోసెస్‌లో విలీనం అయింది.(Source)