లింగభేదం తెలియని ప్రేమ పెళ్లికి సంబంధించిన ఓ హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశంలో స్వలింగ సంపర్క వివాహాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కోర్టు నిర్ణయం తర్వాత స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉండదు. ఇదిలా ఉంటే తెలంగాణాలో ఓ ప్రత్యేక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక అబ్బాయి ప్రేమ కోసం సమాజపు సంకెళ్లను తెంచుకున్నాడు. ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమ చిగురించడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ జంట పోలీసుల నుంచి రక్షణ కోరుతోంది. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన లింగమార్పిడి దీపును వివాహం చేసుకున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు దాదాపు ఏడాది క్రితం నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ జంట తరచూ కలవడం ప్రారంభించారు. ఆపై ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
రిపోర్టుల ప్రకారం, గణేష్, దీపు భద్రత కోరుతూ ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. ఈ పెళ్లికి తమ ఇరు కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కాగా, సోషల్ మీడియాలో వీరి ప్రేమ పెళ్లి వార్త వైరల్‌గా మారింది. వీరి కథ తెలిసి చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Love knows no gender or region: newly married couple Ganesh from #Khammam #Telangana & Deepu, transgender from #Nandigama #AndhraPradesh, met in #Hyderabad & fell in love one year ago; they got married one week ago & came to PS for protection as families opposed @ndtv @ndtvindia pic.twitter.com/cKiShVjbIO
— Uma Sudhir (@umasudhir) November 6, 2023
ఇంతకు ముందు తెలంగాణలో ఇలాంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల హర్షద్‌ను వీణవంకకు చెందిన లింగమార్పిడి దివ్య వివాహం చేసుకుంది. దివ్యను హర్షద్ ఐదేళ్ల క్రితం జగిత్యాలలో కలిశాడు. క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. అప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉంటే, గతంలోనే ఇలాంటి వివాహాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాలకు రాజ్యాంగ చెల్లుబాటును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ 3:2 తీర్పును వెలువరించింది. దీనిపై చట్టాన్ని రూపొందించాల్సింది పార్లమెంట్‌దేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..