Watch Video: ఏమాత్రం తగ్గని అభిమానం.. మిస్టర్ కూల్‌తో అట్లుంటది మరి.. నెట్టింట వైరల్ వీడియో

MS Dhoni: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మిస్టర్ కూల్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పరుగులు తీస్తున్నారు.

Watch Video: ఏమాత్రం తగ్గని అభిమానం.. మిస్టర్ కూల్‌తో అట్లుంటది మరి.. నెట్టింట వైరల్ వీడియో
Ms Dhoni In London Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 16, 2022 | 5:18 PM

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి చాలా కాలం గడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ధోనీ అంటే పిచ్చి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకు సాక్ష్యంగా తాజాగా ఓ వీడియోను చూడొచ్చు. ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ధోని లండన్ వీధుల్లో తిరుగుతున్నట్లు చూడొచ్చు. అతనితో పాటు చాలా మంది అభిమానులు కూడా అతనిని అనుసరిస్తున్నట్లు వీడియోలొ చూడొచ్చు. అభిమానులు ధోనితో సెల్ఫీ దిగేందుకు అతని వెంట పరుగులు తీస్తున్నారు. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ధోనీతో పరుగెత్తుకుంటూ సెల్ఫీలు దిగుతున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ధోనీ ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా కూడా ధోని స్టేడియంలో కనిపించి, సందడి చేశాడు. బీసీసీఐ ధోని ఫొటోలను పంచుకుంది. అందులో అతను భారత యువ ఆటగాళ్ళు, సిబ్బందితో సంభాషిస్తున్నట్లు కనిపించింది.

ఇవి కూడా చదవండి

2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికాడు. వన్డేల్లో ధోనీ పేరిట 10 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. అతను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచాడు. అతని కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!