Viral Video: ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టిన టీ షర్ట్‌.. మెట్రోలో అందరి ముందే ఎలా కొట్టుకున్నారో మీరే చూడండి

Delhi Metro: ప్రేమికుల మధ్య కోపతాపాలు సహజం. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయేతత్వం ఉంటే ఆ ప్రేమ కలకాలం పదిలంగా ఉంటుంది. అలా కాకుండా చీటికి మాటికి చిన్న విషయాలకు కూడా కోప్పడుతూ ఉంటే మాత్రం..

Viral Video: ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టిన టీ షర్ట్‌.. మెట్రోలో అందరి ముందే ఎలా కొట్టుకున్నారో మీరే చూడండి
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2022 | 5:12 PM

Delhi Metro: ప్రేమికుల మధ్య కోపతాపాలు సహజం. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయేతత్వం ఉంటే ఆ ప్రేమ కలకాలం పదిలంగా ఉంటుంది. అలా కాకుండా చీటికి మాటికి చిన్న విషయాలకు కూడా కోప్పడుతూ ఉంటే మాత్రం బ్రేకప్‌లు తప్పవు. ఈక్రమంలో చుట్టూ ఉన్నవాళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు ప్రేమికులు. అది కూడా ఓ మెట్రో ట్రైన్‌లో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి అన్యోన్యంగా ఉండే లవర్స్‌ మధ్య ఇలా గొడవ జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఓ టీషర్ట్‌.. చెప్పుకోవడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.

ఢిల్లీ మెట్రోలో జరిగిన ఈ ఘటనలో ముందుగా అమ్మాయి తాను వేసుకున్న టీ షర్ట్ ధర రూ.1000 అని చెప్పగా.. దానికి అబ్బాయి రూ.150 కూడా ఈ టీ షర్ట్ దొరుకుతుంది అని సరాదాగా సమాధానమిచ్చాడు. దీంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ముందు, వెనుక చూడకుండా ప్రేమికుడిని కొట్టడం మొదలుపెట్టింది.అంతేకాదు అమ్మకు చెప్తానంటూ చిన్నపిల్లలాగా మారాం చేసింది. దీంతో అప్పటిదాకా ఓపికతో ఉన్న ఆ బాయ్‌ఫ్రెండ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. నీలాంటి లవర్ ఎవరికీ ఉండకూడదు అని అమ్మాయి ముఖంమీదే చెప్పేశాడు. దీంతో మళ్లీ అతడిని కొట్టడం మొదలుపెట్టింది ఆ యువతి. ఆ గొడవ జరుగుతుండగానే స్టేషన్ రావడంతో వారిద్దరూ దిగిపోయారు. యువ‌తీ యువ‌కుల చర్యతో అవాక్కైన ప్రయాణికులు వారు దిగిపోగానే నవ్వుకున్నారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇదేం గొడవరా బాబూ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..