Viral News: పెళ్లి కూతురుకు వరుడి స్నేహితులు వింత షరతు.. వివాహ వేదికపైనే బాండు పేపర్‌ మీద సంతకం..

Viral News: వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ఒక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాన్ని...

Viral News: పెళ్లి కూతురుకు వరుడి స్నేహితులు వింత షరతు.. వివాహ వేదికపైనే బాండు పేపర్‌ మీద సంతకం..
Viral News
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2022 | 10:32 AM

Viral News: వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ఒక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాన్ని జరుపుకుంటారు. అలాగే వందేళ్లు కలిసి జీవించే భార్య, భర్తలు కష్టసుఖాల్లో కలిసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ప్రమానం చేస్తారు. ఇది ఎక్కడైనా కనిపించే తంతే.. అయితే తమిళనాడులో మాత్రం ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కూతురుకు వరుడి స్నేహితులు ఓ వింత షరతును విధించారు. అక్కడితో ఆగకుండా వధువుతో ఏకంగా బాండ్‌ పేపర్‌పై సంతకం కూడా చేయించుకున్నారు.

ఇంతకీ వరుడి స్నేహితులు పెట్టిన ఆ షరతు ఏంటి.? నవ వధువు ఎందుకు సంతాకం చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. హరిప్రసాద్‌ అనే వ్యక్తికి మదురైకి చెందిన పూజ అనే యువతితో తాజాగా వివాహం జరిగింది. హరిప్రసాద్‌ తేనీలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ‘సూపర్‌స్టార్‌’ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యహరిస్తున్నారు. అయితే వివాహం తర్వాత తన స్నేహితుడు ఎక్కడ క్రికెట్‌కు దూరమవుతారో, ఎక్కడ తన భార్య క్రికెట్‌కు అనుమతించదో అని అనుమానం వ్యక్తం చేసిన హరిప్రసాద్‌ స్నేహితులు.. వివాహ వేదికపైనే పెళ్లి కూతురుకు ఓ షరతు విధించారు.

Marriage

ఇవి కూడా చదవండి

వీకెండ్స్‌లో హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వధువును కోరారు. దానికి ఆమె కూడా అంగీకరించింది. అయితే హరిప్రసాద్‌ స్నేహితులు అంతటితో ఆగకుండా రూ. 20 బాండు పేపర్‌ తీసుకొచ్చి పెళ్లి కూతురుతో సంతకం కూడా చేయించుకున్నారు. పెళ్లికి విచ్చేసిన అతిథులు ఈ ఘటన చూసి ముందు షాక్‌ అయినా తర్వాత నవ్వుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!