‘టిక్‌టాక్’ చేస్తూ సస్పెండ్ అయిన పోలీసమ్మ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ చేయడంతో గుజరాత్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీస్‌పై అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బేసిగ్గా మోడలింగ్‌పై ఇంట్రస్ట్‌ ఉన్న అర్పితా.. ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది. టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో […]

‘టిక్‌టాక్’ చేస్తూ సస్పెండ్ అయిన పోలీసమ్మ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:19 PM

పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ చేయడంతో గుజరాత్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీస్‌పై అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బేసిగ్గా మోడలింగ్‌పై ఇంట్రస్ట్‌ ఉన్న అర్పితా.. ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది. టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియోకు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఈ పాటను జిగ్నేష్ కవిరాజ్ పాడగా.. మయూర్ నదియా సంగీతం అందించాడు. మను రబారి లిరిక్స్‌ను రాశాడు.

అయితే అర్పితా చౌదరి 2016లో పోలీస్ శాఖలో తన ఉద్యోగాన్ని మొదలుపెట్టింది. 2018లో ఆమె మెహ్నాసా జిల్లాకు బదిలీ అయ్యింది. అక్కడ స్టేషన్‌లో యూనిఫాం వేసుకోకుండా ఓ పాటకు టిక్‌టాక్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆమెపై జూలైలో వేటు పడింది. దీనిపై డీఎస్పీ మంజితా వంజరా మాట్లాడుతూ.. ‘‘అర్పితా రూల్స్‌ను బ్రేక్ చేసింది. డ్యూటీలో ఉండి కూడా ఆమె యూనిఫాం వేసుకోలేదు. అంతేకాకుండా స్టేషన్‌లో ఆమె వీడియోను తీసుకుంది. పోలీసులు కచ్చితంగా క్రమశిక్షణను పాటించాలి. అర్పితాకు క్రమశిక్షణ లేదు అందుకే సస్పెండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.