దాచేపల్లి మండలంలో విచిత్రం..పంది పిల్లకు పాలిచ్చిన శునకం

పందులకు , కుక్కలకు పెద్దగా పడదు. ఒకదానికి ఒకటి తారసపడగానే దాడులు చేసుకుంటాయి. గుంపులుగా ఉన్నా, సింగిల్‌గా ఉన్నా సేమ్ సీన్ రీపిటవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఓ అరుదైన దృశ్యం చూపించబోతున్నాం. ఆకలితో ఉన్న ఓ పందిపిల్లకు కుక్క పాలిచ్చింది. ఆ శునకం ఇటీవలే పిల్లల్ని కన్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. కానీ పంది పిల్ల పాలు తాగుతోన్న సమయంలో కుక్క చిరాకు గానీ , ఇబ్బంది కానీ ఫీల్ అవ్వలేదు. గుంటూరు  జిల్లా […]

దాచేపల్లి మండలంలో విచిత్రం..పంది పిల్లకు పాలిచ్చిన శునకం
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Dec 24, 2019 | 4:07 PM

పందులకు , కుక్కలకు పెద్దగా పడదు. ఒకదానికి ఒకటి తారసపడగానే దాడులు చేసుకుంటాయి. గుంపులుగా ఉన్నా, సింగిల్‌గా ఉన్నా సేమ్ సీన్ రీపిటవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఓ అరుదైన దృశ్యం చూపించబోతున్నాం. ఆకలితో ఉన్న ఓ పందిపిల్లకు కుక్క పాలిచ్చింది. ఆ శునకం ఇటీవలే పిల్లల్ని కన్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. కానీ పంది పిల్ల పాలు తాగుతోన్న సమయంలో కుక్క చిరాకు గానీ , ఇబ్బంది కానీ ఫీల్ అవ్వలేదు.

గుంటూరు  జిల్లా దాచేపల్లి మండలంలో ఈ అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమాత్రం జంతు బేధం చూపని మూగ జీవుల మనసును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వక్యం చేస్తున్నారు. జాతులు వేరైనా ఆకలి ఒకటేగా అంటూ సదరు వీడియోను తిరిగి షేర్స్ చేస్తూ ఉండటంతో అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.