తల్లికి సహాయంగా తనయుడు.. కోవిడ్ బాధితుల కోసం ఈ చిన్నారి చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా.. మనసులను హత్తుకుంటున్న ఫోటో..
కరోనా రెండో దశ.. దేశంలో పరిస్థితి రోజు రోజూకీ మరింత దారుణంగా మారుతుంది. ఇక కోవిడ్ బాధితుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.
కరోనా రెండో దశ.. దేశంలో పరిస్థితి రోజు రోజూకీ మరింత దారుణంగా మారుతుంది. ఇక కోవిడ్ బాధితుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఒక వైపు ఆసుపత్రులలలో సరైన సౌకర్యాలు లేక.. మరోవైపు ఆక్సిజన్, బెడ్స్, వెంటిలెటర్స్ కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. ఇక నీరు, ఆహారం కోసం కరోనా బాధితుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అయితే కరోనా బాధితులకు అండగా.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం, బెడ్స్, ఆక్సిజన్ సాయం చేస్తుండగా.. పలువురు సామాన్యులు వారి ఆకలి బాధను తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ కరోనా పేషెంట్స్ కోసం వంట చేసి వాటిని ప్యాకెట్స్ లో పెట్టి ఆసుపత్రులలో పంచుతున్నారు. అయితే ఆమె కొడుకు కూడా తన తల్లికి ఆహార ప్యాకెట్స్ సర్దడంలో సహాయం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కోవిడ్ రోగుల కోసం తన తల్లి సిద్ధం చేసిన ఆహార ప్యాకెట్స్ పై ఆ చిన్నారి తన చిట్టి చేతులతో సంతోషంగా ఉండండి అంటూ ఇంగ్లీష్, హిందీ భాషలలో రాస్తున్నాడు. టేబుల్ మీద పెట్టిన ఫుడ్ ప్యాకెట్స్ పై ఆ చిన్ని సంతోషంగా ఉండండి అంటూ రాస్తూ.. ఓ స్మైలీ చిత్రాన్ని గీస్తున్నాడు. ఆ చిన్నారి చేస్తున్న పనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు చిన్నారి చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం ప్రజలలో కొత్త ధైర్యాన్ని నింపుతుందని.. ఈ చిన్నారితో కలిసి మనందరం ప్రజలలో ఆనందాన్ని పెంచాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
इस बच्चे की माँ हॉस्पिटल में भर्ती मरीजों के लिए भोजन बनाती हैं, और यह नन्हा सा बच्चा भोजन के हर पैकेट पर लिखता है..”खुश रहिए” ❤️
बात बहुत छोटी सी है पर दिल को छू गई, ईश्वर से प्रार्थना है कि इस बालक की मुस्कान सदैव बनी रहे !!?@sushant_says @ajitanjum pic.twitter.com/eXBCu4Lwcg
— Dinesh Kaushik (@DineshKaushik_) May 18, 2021
Also Read: కాకులకు పెరిగిన డిమాండ్… కరోనా కాలంలోనూ కాకులదే హావా… రెండు చేతుల భారీగా సంపాదిస్తున్న పెద్దాయన..