Shocking Video: ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలును పట్టుకునేందుకు ప్రయత్నించాడు.. ఆ తర్వాత మీరు అనుకున్నట్లుగా జరగలేదు..
అకస్మాత్తుగా అతను జారిపడి నేల మీద పడిపోయాడు. అయితే, రైల్వే సిబ్బంది అతన్ని సకాలంలో రక్షించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్...
రైల్వే స్టేషన్ లో మనం హెచ్చరికల బోర్డ్ లను చూసే ఉంటాం. ప్రయాణికులకు విజ్ఞప్తి ప్రయాణికులు కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. కదులుతున్న రైల్లో నుంచి దిగరాదంటూ రైల్వే స్టేషన్లలో తారసపడుతుంటాయి. కానీ కొంతమంది ప్రయాణికులు అవేం పట్టించుకోకుండా కదులుతున్న రైలెక్కడం, పట్టాలు దాటడంలాంటివి చేస్తుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే, కొంతమంది అదృష్టవంతులు మరియు ఏదో ఒకవిధంగా వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక వ్యక్తి కదిలే రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. కానీ, అకస్మాత్తుగా అతను జారిపడి నేల మీద పడిపోయాడు. అయితే, రైల్వే సిబ్బంది అతన్ని సకాలంలో రక్షించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలు తప్పించుకున్నాడు. ఆ ప్రయాణికుడికి నూకలు రాసిపెట్టి ఉన్నాయట్లుంది. వెంట్రుక వాసిలో కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలను దక్కించుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబై-మంగళూరు ప్రత్యేక రైలును పట్టుకోవడానికి ఒక వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తాడు. అతను రైలు చేరుకునే సమయానికి అది కదిలింది. కానీ, ఆ వ్యక్తి కదిలే రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఇంతలో, రైలు వేగం పెరిగింది. దీని కారణంగా అతడు జారిపడి పడిపోయాడు. ఇది మాత్రమే కాదు.. నెమ్మదిగా కదులుతున్న రైలు కిందికి పోవడం మొదలు పెట్టాడు. ఇది చూసిన ఇద్దరు రైల్వే ఉద్యోగులు అక్కడకు వెళ్లి అతనిని రక్షించారు.
కాబట్టి మొదట మీరు ఈ వీడియో చూడండి…
RPF Constable and Train Guard save the life of a passenger.
There are two heroes in the incident. A passenger who tried to board a moving train 01133 Mumbai-Mangaluru special at CSMT Mumbai on 11.6.2021 and fell down. He was saved by the train Guard (1/n) pic.twitter.com/NPepAfFUPw
— Central Railway (@Central_Railway) June 12, 2021