Viral Video: వామ్మో.. రాక్షస సుడిగాలి అంటే ఇదేనేమో.. ట్రక్కును కూడా ఎత్తిపడేసిందిగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో వైరల్ అవ్వాల్సిందే. ఫన్నీ వీడియోలే కాకుండా.. భయంకరమైన హారర్ వీడియోస్.. జంతువులకు సంబంధించి వీడియోలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో వైరల్ అవ్వాల్సిందే. ఫన్నీ వీడియోలే కాకుండా.. భయంకరమైన హారర్ వీడియోస్.. జంతువులకు సంబంధించి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని వీడియో చూడాలంటే మాత్రం ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతి చిన్న ఘటనను రికార్డ్ చేసి మరి నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. అందులో భయపెట్టేవి ఉన్నాయి.. నవ్వులు పూయించేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాలంటే మాత్రం కచ్చితంగా ధైర్యం కావాల్సిందే. అదెంటో తెలుసుకుందామా.
సాధారణంగా సుడిగాలులు రావడం చూసుంటారు. అయితే మనం రియాల్టీక్గా చూసిన సుడిగాలులకు.. హాలీవుడ్ సినిమాల్లో చూసే సుడిగాలులకు చాలా తేడా ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల్లో చూసే సుడిగాలులలో జంతువులు, చెట్లు అన్ని కొట్టుకుపోవడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం చాలా అరుదు. కానీ అంతటి సుడిగాలి నిజంగానే జనవాసంలో కనిపించింది. వేగంగా వీస్తున్న గాలితో ఎదురుగా అసలేం కనిపించకుండా పోయింది. ఏకంగా ఓ ట్రక్కును సైతం ఎత్తి పడేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును బోల్తా పడేసింది. ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనియాలో వచ్చిన సుడిగాలి అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. ఆ సమయంలో వచ్చిన గాలి వేగం దాదాపు 130 mph ఉంటుంది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే వెళ్తున్న ఓ ట్రక్కులో డాష్ బోర్డులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. అందులో ఎదురుగా రోడ్డు మీద ఉన్న వాహనాలు అసలేం కనిపించకుండా గాలి వేగంగా వ్యాపించింది. ఇక గాలి వేగం పెరిగిన కాసేపటికి ఆ ట్రక్కు పక్కకు బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్స్, క్లీనర్ చిన్న చిన్న గాయాలతో భయటపడ్డారు.
ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతుంది. అత్యంత భయంకరమైన సుడిగాలి ఇది.. తుఫాను హెచ్చరికలను ముందుగానే సీరియస్‌గా తీసుకోవాలని కొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. EF2 తీవ్రత వద్ద ఏర్పడిన సుడిగాలులు దాదాపు కొన్ని ఇళ్లను సైతం ద్వంసం చేయగలవు. అంతేకాదు.. వాహనాలను సైతం గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తాయి.
వీడియో..
Also Read: Nagarjuna : మన్మధుడి సినిమా అంటే మాములుగా ఉండదు మరి.. ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌తో…