Watch Video: ప్రతిరోజు స్కూల్‌కు లేట్.. ఈ పిల్లోడి సమాధానం విని టీచర్స్ షాక్, వైరల్ వీడియో

ఇంట్లో అలర్లి చేసే పిల్లలు.. స్కూల్ గుర్తుకువచ్చేసరికి ఒక్కసారిగా బోరున ఏడ్చేస్తుంటారు. అయితే పెరేంట్స్ కూడా తమ పిల్లలను సమయానికి పాఠశాలకు పంపించి మంచి విద్యను అందించడానికి కృషి చేస్తారు. అంతేకాదు.. ఇందుకోసం వారు తమ దినచర్యను కూడా మార్చుకుంటారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిల్లొడికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Watch Video: ప్రతిరోజు స్కూల్‌కు లేట్.. ఈ పిల్లోడి సమాధానం విని టీచర్స్ షాక్, వైరల్ వీడియో
School Boy 1
Follow us
Balu Jajala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 17, 2024 | 7:26 AM

ఇంట్లో అలర్లి చేసే పిల్లలు.. స్కూల్ గుర్తుకువచ్చేసరికి ఒక్కసారిగా బోరున ఏడ్చేస్తుంటారు. అయితే పేరెంట్స్ కూడా తమ పిల్లలను సమయానికి పాఠశాలకు పంపించి మంచి విద్యను అందించడానికి కృషి చేస్తారు. అంతేకాదు.. ఇందుకోసం వారు తమ దినచర్యను కూడా మార్చుకుంటారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిల్లొడికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చిన్నారి పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడంతో టీచర్‌కు ఏడుస్తూ తన పరిస్థితి గురించి చెప్పాడు.

వై ఆర్ యూ సో లేట్ అని టీచర్ అడగగానే తన తల్లి సమయానికి నిద్రలేపడం లేదని, దాని వల్ల పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నానని టీచర్‌తో చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో పిల్లవాడు పాఠశాలకు ఆలస్యంగా చేరుకున్నట్లు చూడవచ్చు. ఆలస్యంగా వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమయ్యావురా అని అడుగుతుంది. దానికి పిల్లవాడు “మమ్మీ సమయానికి నిద్ర లేస్తుంది కానీ. నన్ను లేపలేదు” అని చెప్పాడు.

అప్పుడు టీచర్ “స్కూల్ 7:30కి అని చెప్పు, 8:30కి స్కూల్ లో ఉంటావ్ అని చెప్పగా.. అప్పుడు పిల్లవాడు “నాకు తెలియదు.” బోరున ఏడుస్తూ సమాధానం ఇస్తాడు. ఇన్ స్టాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా నెటిజన్స్ చేశారు. నవ్వు ఆపుకోలేకపోతూ కామెంట్లు చేశార. “బహుశా పిల్లవాడు నిజం చెబుతున్నాడు” అని, “ఆలస్యంగా వచ్చినందుకు మంచిగా అబద్దం చెప్పాడు” అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..