AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాకాసి బల్లికి ఇచ్చిపడేసిన దున్నపోతు.. కొమ్ములతో పొడుస్తూ.. చివరికి ఏం జరిగిందంటే?

ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ భూమండలం మొత్తం భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి ఉనికి నిరూపించే ఎన్నో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా..

Viral Video: రాకాసి బల్లికి ఇచ్చిపడేసిన దున్నపోతు.. కొమ్ములతో పొడుస్తూ.. చివరికి ఏం జరిగిందంటే?
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 15, 2024 | 12:24 PM

Share

ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ భూమండలం మొత్తం భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి ఉనికి నిరూపించే ఎన్నో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా పరిశోధనలు చేసి రాకాసి బల్లుల ఉనికి నిజమే అని చెప్పారు. అయితే కాలక్రమంలో భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, తుఫాన్‌లు, భూకంపాల కారణంగా ఈ రాకాసి బల్లులు చాలా వరకు అంతరించిపోయాయి.

ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో సంచరిస్తున్న ఈ రాకాసి బల్లులను మోనిటర్ లిజార్డ్స్ అంటారు. అలాగే ఇవి చాలా బలంగా ఉండటంతో పాటు భారీ శరీరం కలిగి ఉంటాయి. వీటి నాలుక పొడవుగా ఉంటుంది. వీటి లాలాజలంలో ఇరవై రకాల బాక్టీరియాలు ఉండటం వలన లాలాజలం చాలా విషపూరితంగా ఉంటుంది. ఇదిలావుంటే.. ఈ రాకాసి బల్లి జాతికి చెందిన కొమాడో డ్రాగన్ వేటాడటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ వీడియో మీకోసమే. ఓ అటవీ ప్రాంతంలో కొన్ని గేదెలు గడ్డి మేస్తూ ఉంటాయి. ఇక ఆ మందపైకి ఆకలితో ఉన్న ఓ కొమాడో డ్రాగన్ అదే అదునుగా వేటాడటానికి ప్రయత్నించింది.

అసలే రాకాసి బల్లి.. అదీనూ ఆకలితో వస్తుండటం గమనించిన గేదెలు.. ఒక్క ఉదుటున పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. కానీ ఓ దున్నపోతు మాత్రం ఎక్కడా కూడా భయపడకుండా.. జంకు అన్నది లేకుండా కొమాడో డ్రాగన్ వైపుకి దూసుకొస్తుంది. కొమ్ములతో పొడుస్తూ దానిపై దాడికి దిగింది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు యుద్ధం జరిగింది. ఇక ఇదంతా కూడా అక్కడున్న టూరిస్ట్‌లు తన కెమెరాల్లో బంధించగా.. ఇంటర్నెట్‌లో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లేట్ ఎందుకు దానిపై ఓ లుక్కేయండి మరి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..