కాలుష్యం అరికట్టడానికి ఆ దేశంలో పాప్, డిస్కో, రాక్ మ్యూజిక్ పై నిషేధం.. ఎప్పటి నుంచి అమలు అంటే
ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ ప్రకారం చెచ్న్యా ఇటీవల రష్యన్ నృత్య సంగీతాన్ని నిషేధించింది. ఇది చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా ప్లే చేయబడుతుందని దీంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని చెప్పింది. దీంతో కాలుష్యంపై పోరాడే వింత ప్రయత్నంగా సంగీతంపై నిషేధం విధించినట్లు వాదిస్తోంది. చెచ్న్యా సాంస్కృతిక మంత్రి ముసా దాడేవ్ ఇటీవల ఒక ప్రకటన చేసారు. ఆధునిక నృత్య సంగీతాన్ని ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తామని వెల్లడించారు.

సంగీతం లేదా పాటలు వినడాన్ని మనుషులు మాత్రమే కాదు జంవుతులు, పక్షులు కూడా ఇష్టపడతాయి. మంచి సంగీతాన్ని వినడం వల్ల వివిధ వ్యాధుల నుంచి బయటపడవచ్చని నమ్మకం. రోగికి ఇష్టమైన సంగీతాన్ని ఆసుపత్రిలో ప్లే చేసినప్పుడు అతను వ్యాధి నుంచి కోలుకున్న ఘటనలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మారిన కాలంతో పాటు మనుషుల వచ్చిన అభిరుచుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొంతమందికి స్లో మ్యూజిక్ కూడా ఇష్టం. అయితే ప్రపంచంలో చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా సంగీతాన్ని ప్లే చేయడం ఒక ప్రదేశంలో నిషేధించబడిందని తెలుసా.. అవును, ఈ ప్రదేశం పేరు చెచ్న్యా.
చెచ్న్యా రష్యాలో భాగమైనప్పటికీ.. ఇది ప్రత్యేక దేశంగా ఏర్పడానికి అనేక యుద్ధాలు జరిగాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెచ్న్యాకు రష్యాకువేర్వేరు అధ్యక్షులున్నారు. అంతే కాకుండా ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉంది. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ ప్రకారం చెచ్న్యా ఇటీవల రష్యన్ నృత్య సంగీతాన్ని నిషేధించింది. ఇది చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా ప్లే చేయబడుతుందని దీంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని చెప్పింది. దీంతో కాలుష్యంపై పోరాడే వింత ప్రయత్నంగా సంగీతంపై నిషేధం విధించినట్లు వాదిస్తోంది.
ఆధునిక నృత్య సంగీతాన్ని ప్లే చేయడం నేరం
చెచ్న్యా సాంస్కృతిక మంత్రి ముసా దాడేవ్ ఇటీవల ఒక ప్రకటన చేసారు. ఆధునిక నృత్య సంగీతాన్ని ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్లబ్‌లలో ప్లే చేస్తారు. చెచ్న్యా ప్రజల మనస్తత్వం, లయ భావనకు అనుగుణంగా సంగీత, గాత్ర, కొరియోగ్రాఫిక్ ఉండాలని.. పాటలు నిమిషానికి 80-116 బీట్‌ల టెంపోకు అనుగుణంగా ఉండాలని దాడేవ్ పేర్కొన్నాడు. కొత్త నిబంధనలకు అనుగుణంగా లేని ఏదైనా సంగీతం రాయడం ప్లే చేయడం నేరమని.. కనుక సొంతంగా సంగీతం తయారు చేసుకోవడానికి చెచ్న్యా కళాకారులకు జూన్ 1 వరకు సమయం ఇవ్వబడిందని రష్యన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
పాప్, డిస్కో లేదా రాక్ సంగీతంపై నిషేధం
చెచ్న్యా రిపబ్లిక్ అధిపతి రంజాన్ అఖ్మాటోవిచ్ కదిరోవ్ సమ్మతితో ఫాస్ట్ గా లేదా స్లో గా ప్లే చేసే మ్యూజిక్ ని నిషేధించాలని నిర్ణయించినట్లు ముసా దాడేవ్ చెప్పారు. ఈ కొత్త నియమం ప్రకారం చెచ్న్యాలో ఎవరూ పాప్, డిస్కో లేదా రాక్ సంగీతాన్ని ప్లే చేయలేరు లేదా అలాంటి పాటలను రూపొందించడానికి ఏ సంగీతకారుడిని అనుమతించరు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




