AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్సర్ షీట్‌లో స్టూడెంట్ రాసిన సమాధానం నెట్టింట వైరల్.. పెద్దైతే ఎక్కడైనా బతికేస్తాడు అంటూ ప్రశంసలు..

ప్రతి ఒక్కరికీ స్కూల్, కాలేజీ లైఫ్ ను రాకరకాలుగా అనుభవించి ఉంటారు. కొన్ని సార్లు పరీక్షల్లో ప్రశ్న పత్రంలోని ప్రశ్నకు సమాధానం అర్థం కానప్పుడు.. జవాబు పత్రాన్ని ఖాళీగా ఉంచుతారు లేదా దాని స్థానంలో నోటికి వచ్చిన సమాధానాలు వ్రాస్తారు. కొంతమంది విద్యార్థులు మాత్రమే ప్రశ్న ఎలా ఉన్నా దానికి తగిన విధంగా సమాధానాలను బాగా వ్రాస్తారు. ఈ సమాధానం ఉపాధ్యాయుడిని కూడా ఆకట్టుకుంది.

ఆన్సర్ షీట్‌లో స్టూడెంట్ రాసిన సమాధానం నెట్టింట వైరల్.. పెద్దైతే ఎక్కడైనా బతికేస్తాడు అంటూ ప్రశంసలు..
6th Class StudentImage Credit source: Twitter/pixabay
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 11:25 AM

Share

పాఠశాలలు, కళాశాలలలో వివిధ రకాల విద్యార్థులు ఉన్నారు. చాలా మంది విద్యార్థులు చదువులో చాలా చురుకుగా ఉంటే మరి కొందరు చదువుపై చాలా తక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే ఈ రెండు రకాల స్టూడెంట్స్ కు పూర్తి భిన్నమైన పిల్లలు కొందరు ఉంటారు.. వీరికి అవకాశం బట్టి తమని తాము మలచుకుంటారు. అలాంటి ఒక విద్యార్థి సమాధాన పత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిని చూస్తే ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా నవ్వాల్సిందే..

ప్రతి ఒక్కరికీ స్కూల్, కాలేజీ లైఫ్ ను రాకరకాలుగా అనుభవించి ఉంటారు. కొన్ని సార్లు పరీక్షల్లో ప్రశ్న పత్రంలోని ప్రశ్నకు సమాధానం అర్థం కానప్పుడు.. జవాబు పత్రాన్ని ఖాళీగా ఉంచుతారు లేదా దాని స్థానంలో నోటికి వచ్చిన సమాధానాలు వ్రాస్తారు. కొంతమంది విద్యార్థులు మాత్రమే ప్రశ్న ఎలా ఉన్నా దానికి తగిన విధంగా సమాధానాలను బాగా వ్రాస్తారు. ఈ సమాధానం ఉపాధ్యాయుడిని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ విద్యార్థి జవాబు పత్రాన్ని చూడండి… అందులో విద్యార్థి ఉపాధ్యాయునిపై అటువంటి వ్యాసాన్ని వ్రాసాడు.  అది చూసిన తర్వాత ఖచ్చితంగా మీ రోజు మారుతుంది.

ఇవి కూడా చదవండి

జవాబు పత్రాన్ని ఇక్కడ చూడండి

వైరల్ అవుతున్న ఈ జవాబు పత్రంలో ఒక విద్యార్థి తనకు ఇష్టమైన ఉపాధ్యాయుడిపై ఒక వ్యాసం రాసినట్లు మీరు చూడవచ్చు. ఆ వ్యాసంలో మాకు టీచర్లందరూ ఇష్టమే, కానీ చాలా ఇష్టమైనది భూమిక మేడమ్, మాకు చాలా మంచి విషయాలు చెబుతారు. మంచి విషయాలు నేర్పుతారు. మమ్మల్ని చాలా ప్రేమిస్తారు ‘ అని ఆమె రాసింది. అంతే కాకుండా పిల్లలు మనస్పూర్తిగా చదువుకునేలా భగవంతుడు అలాంటి గురువును అందరికీ ప్రసాదించాలని కూడా రాశాడు. దీనితో పాటు.. విద్యార్థి ఐ లవ్ యు భూమి మేడమ్ అని కూడా రాశాడు.

ఈ చిత్రాన్ని @Rajputbhumi157 అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేసారు. ఇప్పటికే ఈ పోస్ట్ ను వేల మంది చూసి రకరకాల కామెంట్ చేశారు. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు, ‘ఏదైనా చెప్పండి, అబ్బాయి చేతివ్రాత అద్భుతంగా ఉంది’ అని రాశారు. మరొకరు, ‘ఈ వ్యక్తి భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతాడు’ అని రాశాడు. ఇది కాకుండా చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని రకరకాలుగా  తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..