Viral Video: ప్రపోజ్ చేయడానికి వెళ్తే.. ముఖం పక్కకు తిప్పుకుని వెళ్లిపోయింది.. కట్ చేస్తే
ఎన్నాళ్ల నుంచి ఇష్టపడుతున్నాడో తెలీదు... తన ప్రేమను ఆ రోజు ఎక్స్‌ప్రెస్ చేయడానికి వెళ్లాడు. కానీ ఆ అమ్మాయి కనీసం అతడి ముఖం దిక్కు కూడా చూడలేదు. ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చినట్లు పక్కక తప్పుకుపోయింది. దీంతో ఆ కుర్రాడు.. ఏం చేశాడంటే...?

ఆ కాలేజ్‌లో ఓ ఫంక్షన్ జరుగుతోంది. అంతా కోలాహాలం. పాటలు, డ్యాన్సులు.. ఆ హొరు వేరే ఉంది. అమ్మాయిలు హఫ్ శారీలు, చీరల్లో మెరిసిపోతున్నారు. అబ్బాయిలు తమ క్లాసు అమ్మాయిల్ని అలా చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు. అబ్బాయిల్లో కూడా కొందరు ట్రెడిషనల్ డ్రస్సులు వేశారు. కల్చలర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. స్మాల్ బ్రేక్ అనుకుంటా. అందరూ బయట గ్రౌండ్‌లోకి వచ్చారు. అమ్మాయిలు అందరూ ఒక గుంపుగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక అబ్బాయి.. తన ఫ్రెండ్‌ను తీసుకుని పసుపురంగు చీర కట్టుకున్న ఓ అమ్మాయికి ప్రపోజ్ చేసేందుకు వెళ్లాడు. చేతిలో ఫ్లవర్ కూడా ఉంది. అయితే ఆ అమ్మాయి కనీసం అతడి వైపు కూడా చూడకుండా తల తిప్పుకుని వెళ్లిపోయింది. అయితే అతడు షేమ్ ఫీల్ అవ్వలేదు. అంతే యాటిట్యూట్ చూపిస్తూ.. ఫ్లవర్ అక్కడ విసిరికొట్టి వెళ్లిపోయాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అనే టైటిల్‌తో ఉన్న ఈ వీడియో ప్రజంట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
View this post on Instagram
ఈ వీడియోకు లక్షకు పైగానే లైక్స్ వచ్చాయి. భయ్యా సేమ్ నువ్వు నాలానే బిహేవ్ చేశావ్ అని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. కనీసం అతడు చెప్పాక రిజెక్ట్ చేసుంటే వేరు… కానీ అలా వెళ్లిపోవడం బాలేదు అని ఓ అమ్మాయ్ కామెంట్ పెట్టింది. అంతమందిలో ఆ అమ్మాయి ఇబ్బంది ఫీల్ అయి ఉంటుంది. సింగిల్‌గా ఉన్నప్పుడు అప్రోచ్ అయితే బాగుండేది అని మరో యూజర్ పేర్కొన్నాడు. మొత్తంగా ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
