AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐస్‌ బ్లాక్‌లో చనిపోయిన ఎలుక..! ఆ హోటళ్లో తిన్నవారికి ఇక ఆ దేవుడే దిక్కు!

ఓ ఆటో మొబైల్ సంస్థకు సరఫరా చేసిన సమోసాలలో గుట్కా ప్యాకెట్లు, కండోమ్‌లు, చిన్న చిన్న రాళ్లు లభ్యమయ్యాయి. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరో భయంకర ఘటన ఐస్ ఫ్యాక్టరీ హోటళ్లకు సరఫరా చేసిన ఐస్ బ్లాక్‌లలో చనిపోయిన ఎలుక కనిపించింది. దీంతో ఇప్పుడు హోటళ్లలో భోజనం చేసే వారి ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది.

ఐస్‌ బ్లాక్‌లో చనిపోయిన ఎలుక..! ఆ హోటళ్లో తిన్నవారికి ఇక ఆ దేవుడే దిక్కు!
Dead Rat
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2024 | 11:55 AM

Share

రెండు రోజుల క్రితం ఓ సంస్థకు సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా దొరకడం కలకలం రేపింది. ఇలాంటిదే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హోటళ్లకు సరఫరా చేసే ఐస్ బ్లాక్‌లో మృతకళేబరం కనిపించింది. ఈ ఘటన ప్రజల్ని మరింతగా భయపెడుతుంది. రెండు రోజుల క్రితం ఏప్రిల్ 8న పూణెలోని పింప్రి చించవాడిలో ఉన్న ఓ ఆటో మొబైల్ సంస్థకు సరఫరా చేసిన సమోసాలలో గుట్కా ప్యాకెట్లు, కండోమ్‌లు, చిన్న చిన్న రాళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రహీమ్ షేక్, అజర్ షేక్, మజర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరికి ఇచ్చిన ఫుడ్ కాంట్రాక్టును ఆహారంలో కల్తీ చేయడంతో మరో సంస్థకు ఇచ్చి కొత్తగా ఒప్పందం చేసుకున్న ఫుడ్ ఆర్గనైజేషన్ పేరును చెడగొట్టేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రలోని జున్నార్‌లోని ఐస్ ఫ్యాక్టరీ హోటళ్లకు సరఫరా చేసిన ఐస్ బ్లాక్‌లలో చనిపోయిన ఎలుక కనిపించింది. ఈ ఘటన ఇప్పుడు హోటళ్లలో భోజనం చేసే వారి ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. జున్నార్‌లోని ఐస్ ఫ్యాక్టరీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, వివిధ స్ట్రీట్‌ ఫుడ్ పాయింట్లకు కూడా ఐస్ బ్లాక్‌లను సరఫరా చేసింది.

ఈ ఘటనపై పుణెలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ అర్జున్ భుజ్‌బల్ మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడానికి తమ అధికారులను జున్నార్‌కు పంపామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రాధాన్యత ఆధారంగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని మా ఎఫ్‌డిఎ పూణే కార్యాలయాన్ని ఆదేశించామని రాష్ట్ర ఆహార శాఖ మంత్రి ధర్మారావు బాబా అత్రం తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎండాకాలం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. రసాలు, మిల్క్ షేక్స్, శీతల పానీయాలు వంటి అనేక పానీయాలకు ఐస్ కలుపుతారు. వీధి వ్యాపారులు పండ్లు, డ్రై ఫ్రూట్ జ్యూస్, మిల్క్‌షేక్‌లు, చెరకు రసం లస్సీ, సిరప్ షర్బత్ ఐస్ గోల్, ఫలూడా మొదలైన వాటికి ఐస్ క్యూబ్‌ను వినియోగిస్తుంటారు. ప్రతిరోజూ వేలాది మంది ఈ పానీయాలను తీసుకుంటారు. ఇంతలో, అటువంటి ప్రాంతాలకు ఐస్ బ్లాక్‌లను సరఫరా చేస్తున్న ఐస్ ఫ్యాక్టరీలోని బ్లాక్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. ఈ ఘటన ప్రజల ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..