Viral Video: నీటిలో తప్పించుకుంది.. ఒడ్డున చిక్కింది.. పామును కరకర నమిలిన మొసలి
నీటిలో ఉన్నప్పుడు మొసలి దవడల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడింది. కానీ ఒడ్డుకు వచ్చాక అనుకోని సమస్య ఎదురైంది. తీవ్రమైన బురద ఉండటంతో పాము వేగంగా పాకలేకపోయింది. దీంతో మొసలి వడివడిగా వెళ్లి పామును నోటబట్టింది.. వీడియో...

అడవిలో ఒక జంతువుకు ఆకలి వేస్తే.. మరో జంతువుకు ఆయువు మూడినట్లే. పొట్ట మాడకుండా ఉండాలంటే.. మరో జీవిని వేటాడాల్సిందే. ఆహారం కోసం.. వేటాడే జంతువులు మనకు చాలా క్రూరంగా అనిపిస్తాయి కానీ.. అది అక్కడ జీవన విధానంలో భాగం. ఇక మనకు జంతువుల మధ్య ఫైట్స్, వేటకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ప్రజంట్ వైరల్ అవుతోంది. తొలుత ఓ మాంబా స్నేక్.. ఓ మొసలి బారి నుంచి తప్పించుకోగలిగింది. కానీ తర్వాత జాప్యం చేయడంతో ప్రాణం బలైపోయింది. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లోని షింగ్‌వెడ్జీ నది వద్ద ఈ దృశ్యాలను చిత్రీకరించారు. దానిని తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఏప్రిల్ 11 న పోస్ట్ చేసారు.
నదీతీరంలో ప్రాణాంతకమైన మాంబా పామును మొసలి గుర్తించింది. అది కదులుతున్న వేగం చూస్తుంటే.. పాము కేవలం దాహార్తిని తీర్చుకోడానికి అక్కడికి వెళ్లినట్లు లేదు. బహుశా నదిని దాటాలనే ప్రయత్నంలా కనిపిస్తుంది. పాము కదులుతున్నప్పుడు, సమీపంలోని మొసలి చూసి.. దాన్ని వేటాడేందుకు దూసుకెళ్లింది. మొసలి వేగంగా దాడి చేసినప్పటికీ, బ్లాక్ మాంబా చాలా చురుగ్గా తప్పించుకుంది. మెరుపు వేగంతో మొసలి దవడల నుంచి తప్పించుకుంది. నీటిలో ఉన్నప్పుడు బాగానే పాకిన పాము.. ఒడ్డున ఉన్న బురదను తప్పించుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత.. మొసలి వడివడిగా వెళ్లి.. పామును పట్టేసి.. కరకరా నమిలి తినేసింది. మొసలి… పాము విషానికి భయపడదు. ఎందుకంటే తన మందపాటి తోలును దాటి లోపలికి వెళ్లే శక్తి పాము కోరలకు లేదు.
ఈ దృశ్యాన్ని ఒక శ్రద్ధగల డేగ దూరం నుంచి వీక్షించింది. అక్కడికి వెళ్తే ప్రమాదం అనుకుందో ఏమో.. భీకర యుద్ధంలో జోక్యం చేసుకోకూడదని తెలివిగా అలా చూస్తూ ఉండిపోయింది.
వీడియోను దిగువన చూడండి….
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
