Common krait: కట్లపాము తాచుపాము కంటే డేంజర్.. అది చచ్చిన పామైనా ప్రమాదమే
ఇండియాలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో కట్లపాము మొదటి వరసలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడే కట్లపాము రకం.. కామన్ క్రెయిట్. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేలపై పడుకునే దుప్పట్లోకి వచ్చి దూరుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి...

ఇప్పుడు ఎండాకాలం నడుస్తోంది.. దీంతో అటవీ జంతువులు, పాములు.. దాహంతో, వేసవి తాపంతో జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జాగ్రత్తులు అవసరం. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే గ్రామాలు, తండాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. పాముల విషయంలో అందరూ తాచుపాము డేంజర్ అనుకుంటారు. అది నిజమే కానీ.. దాని కంటే డేంజర్ కట్లపాము. మన ప్రాంతాల్లో ఎక్కువ కామన్ క్రెయిట్ రకం కట్లపాము కనిపిస్తూ ఉంటుంది. ఈ పాముకు మొహమాటం ఎక్కువ.. పగటిపూట పెద్దగా బయటకు రాదు. రాత్రళ్లు వేట సాగిస్తూ.. దూకుడుగా అటాక్ చేస్తుంది. చూడటానికి అందం ఉంటుంది కానీ కాటు పడిందంటే ఖేల్ ఖతమే.
తనకు ఏదైనా డేంజర్ ఉంది అనుకున్నప్పుడు చుట్టలు వేసుకుని.. శరీరం కింద తలను దాచుకుంటుంది. కట్లపాము కాటేసిన చోట గాట్లు చాలా సన్నగా ఉంటాయి. కొన్నిసార్లు పెయిన్ కూడా ఉండదు. పరదాలు, పందిళ్లు, గడ్డివాములు, చెద పుట్టలు, బొర్రలలో కంపల్లో ఇది ఎక్కువ నక్కి ఉంటుంది. కట్లపాములు పంది కొక్కుల్ని ఇష్టంగా తింటాయి. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇవి తచ్చాడుతూ ఉంటాయి.
కట్లపాము కాటువేసిన వెంటనే పాయిజన్ రక్తం గుండా వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఈ పాము విషం నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రపోతున్నప్పుడు కాటువేస్తే.. గమనించకపోతే మరణం తథ్యం. ఇది అప్పుడప్పుడు ఇతర పాములను తింటుంది. కట్లపాములు సహజంగా 5 అడుగుల 9 అంగుళాల వరకూ పొడవు ఉంటాయి. ఈ పాములతో పెను ప్రమాదం ఏంటి అంటే.. చనిపోయాక కూడా చాలాసే దాని నాడీ మండలం చురుగ్గానే ఉంటుంది. అందువల్ల చనిపోయిన పాములతో కూడా జాగ్రత్తగా ఉండాలి.
