AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer: ఏం నాయనా బీర్ కావాలా? అయితే, ఓ సన్‌‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్ కొట్టు.. బంపర్ ఆఫర్ ఇఛ్చిన ‘పబ్’!

Beer: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా.. యూరప్ కంట్రీస్‌లో ఈ సమస్య మరింత..

Beer: ఏం నాయనా బీర్ కావాలా? అయితే, ఓ సన్‌‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్ కొట్టు.. బంపర్ ఆఫర్ ఇఛ్చిన ‘పబ్’!
Beer For Sunflower Oil
Shiva Prajapati
|

Updated on: Jul 24, 2022 | 7:06 AM

Share

Beer: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా.. యూరప్ కంట్రీస్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందనే చెప్పాలి. కారణం.. సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ ప్రపంచ ఎగుమతుల్లో 80శాతం ఈ రెండు దేశాల నుంచే అవుతోంది. అయితే, ఈ రెండు దేశాల మద్య యుద్ధం.. యూరోపియన్ దేశాలను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. రాప్‌సీడ్, సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్స్ కంటికైనా కనిపించడం లేదు.

అయితే, జర్మనీలో ఈ వంటనూనె కొరతను అధిగమించడానికి ఒక పబ్ వినూత్న ప్రయోగం చేసింది. సాధారణంగా అయితే ఆల్కాహాల్ తాగితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం డిఫరెంట్. పబ్‌కు వచ్చే కస్టమర్లు.. బీర్ తాగనిందుకు నగదు చెల్లించే బదులు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ ఇచ్చి బిల్లు చెల్లించాలని కోరుతోంది. దక్షిణ జర్మనీలోని మ్యూనిచ్‌లోని గీసింజర్ బ్రూవరీ అదే పరిమాణంలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో వినియోగదారులకు వారి ఇష్టమైన బీర్‌ను లీటరుకు అందజేస్తోంది. దీనికి సంబంధించిన ఆఫర్ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘‘ఆయిల్ దొరకడం కష్టంగా ఉంది. పబ్‌లో ష్నిట్జెల్స్‌ స్నాక్స్ వేయించడానికి వారానికి 30 లీటర్ల ఆయిల్ అవసరం. అయితే, 15 లీటర్లు మాత్రమే దొరుకుతోంది. దీని కారణంగా ఏదో ఒకరోజు ష్నిట్జెల్స్‌ స్నాక్స్ అందుబాటులో ఉండని పరిస్థితి ఉంటుంది.’’ అని పబ్ మేనేజర్ ఎరిక్ హాఫ్‌మన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ బార్‌లో ప్రసిద్ధ సెంట్రల్ యూరోపియన్ స్నాక్స్ ష్నిట్జెల్స్‌(మాంసం). దీనిని మద్యం ప్రియులు మంచింగ్‌గా విపరీతంగా లాగేంచేస్తుంటారు. దీనిని తయారు చేయడానికి నూనె కొరత ఏర్పడటం వల్లే పబ్ మేనేజ్‌మెంట్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

కస్టమర్లకు ఇది బంపర్ ఆఫర్.. బ్రూహౌస్, పబ్‌ ప్రకటించిన ఈ ఆఫర్ కస్టమర్లకు నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే.. జర్మనీలోని పబ్‌లలో లీటరు బీర్ ధర దాదాపు 7 యూరోలు(రూ. 560 కంటే ఎక్కువ) ఉండగా, ఒక లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్ రిటైల్‌లో దాదాపు 4.5 యూరోలకు అమ్ముడవుతుంది. అంటే.. ఆయిల్ ఎక్స్ఛేంజ్‌ ద్వారా తక్కువ ధరకే బీరు పొందవచ్చన్నమాట.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..