Dance metro station: మెట్రో స్టేషన్‌లో కాదు.. ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లో కూడా ఇరగదీసిన యువతి..! దుమ్ము లేపింది అంటూ..

Dance metro station: మెట్రో స్టేషన్‌లో కాదు.. ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లో కూడా ఇరగదీసిన యువతి..! దుమ్ము లేపింది అంటూ..

Anil kumar poka

|

Updated on: Jul 24, 2022 | 8:17 AM

నిత్యం లక్షలాది మందిని వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది హైదరాబాద్ మెట్రో రైళ్లు. ట్రాఫిక్ చికాకులు, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఏసీలో ప్రయాణానికి హైదరాబాదీలు


నిత్యం లక్షలాది మందిని వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది హైదరాబాద్ మెట్రో రైళ్లు. ట్రాఫిక్ చికాకులు, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఏసీలో ప్రయాణానికి హైదరాబాదీలు అలవాటు పడటంతో మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొంతమంది యువతీయువకులు ఈ రైల్వేస్టేషన్‌లో అతి చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై HMRఅధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువతిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో స్టేషన్‌లోకి స్నేహితులతో కలిసి వచ్చిన యువతి ప్లాట్‌ఫామ్‌పై ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అసలే అందమైన అమ్మాయి, పైగా మోడ్రన్ దుస్తుల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో ఆమె టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో మెట్రో అధికారులకు చేరడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేషన్లో డ్యాన్సులు చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఆ యువతి ఎవరు, ఏ స్టేషన్లో డ్యాన్స్ చేసిందో గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 24, 2022 08:17 AM