AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవి మధ్యలో అద్భుతం.. ప్రపంచంలోనే బాగా ఖరీదైన హోటల్.. ఒక్క రోజుకు ఎంతో తెలిస్తే అవాక్కే..

ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలన్నా.. విలాసానికి కొత్త అర్థం తెలుసుకోవాలన్నా ఈ రిసార్ట్‌కు మించిన చోటు మరొకటి లేదు. ప్రపంచ ప్రఖ్యాత రిట్జ్ కార్ల్టన్ గ్రూప్ రూపొందించిన ఈ వింతలో ఒక రాత్రి గడపాలంటే సామాన్యుల ఏడాది సంపాదన ఖర్చు చేయాల్సిందే.. ఇంతకీ అక్కడ అంత స్పెషాలిటీ ఏముంది అనేది తెలుసుకుందాం..

అడవి మధ్యలో అద్భుతం.. ప్రపంచంలోనే బాగా ఖరీదైన హోటల్.. ఒక్క రోజుకు ఎంతో తెలిస్తే అవాక్కే..
Most Expensive Luxury Resort
Krishna S
|

Updated on: Apr 06, 2026 | 11:51 AM

Share

పర్యాటక లోకంలో బాలి ఒక రంగుల కల. కానీ ఆ కలలో కూడా ఊహించని విలాసాన్ని అనుభవించాలంటే మాత్రం మండప రిసార్ట్‌కు వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో, కోట్లు కుమ్మరించిన సౌకర్యాల మధ్య గడపాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఇండోనేషియాలోని ఉబుద్ ప్రాంతంలో ఉన్న ఈ మండప రిసార్ట్, రిట్జ్-కార్ల్టన్ రిజర్వ్ గ్రూప్‌కు చెందింది. చుట్టూ దట్టమైన అడవులు, పచ్చని వరి పొలాలు, ప్రవహించే అయంగ్ నది.. ఈ వాతావరణం చూస్తుంటే మనం ఏదో మాయాలోకంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది. సిటీ లైఫ్ ఒత్తిడికి దూరంగా, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో విలాసవంతమైన జీవితాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు.

ఒక్క రాత్రికి రూ.1.2 లక్షలు

అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఒక రాత్రి బస చేయాలంటే సుమారు రూ. 1.2 లక్షల నుండి ప్రారంభమవుతుంది. సీజన్, మీరు ఎంచుకునే విల్లాను బట్టి ఈ ధర ఇంకా పెరగొచ్చు. కేవలం పడుకోవడానికి ఇన్ని లక్షలా అనిపిస్తుంది కదా? కానీ అక్కడ ఇచ్చే సర్వీస్ అలాంటిది మరి.. ఇక్కడి సూట్‌లు, విల్లాలు సాధారణ హోటల్ గదుల్లా ఉండవు. ఒక పెద్ద ఇల్లు ఎలా ఉంటుందో.. లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, విశాలమైన బాల్కనీలతో అంతకంటే విలాసంగా ఉంటాయి. ఇక్కడి బాత్రూమ్‌లలో వెదురుతో డిజైన్ చేసిన బాత్‌టబ్‌లు ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతిని చూస్తూ రిలాక్స్ అవ్వడానికి ఇవి అద్భుతంగా ఉంటాయి. అడవి మధ్యలో, నది గలగలల మధ్య కూర్చుని అల్పాహారం చేయడం ఇక్కడ మాత్రమే సాధ్యం. సాంప్రదాయ బాలి వంటకాలు ఇక్కడ ఫేమస్.

నది ఒడ్డున రొమాంటిక్ డిన్నర్

సాయంత్రం వేళల్లో స్థానిక బాలి నృత్యాలు, ప్రత్యక్ష సంగీతం పర్యాటకులను అలరిస్తాయి. ముఖ్యంగా అయంగ్ నది ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది పర్యాటకులకు ఒక మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. బాలి వెళ్లాలనుకునే భారతీయులకు ఒక మంచి విషయం ఏంటంటే.. మన పాస్‌పోర్ట్ ఉంటే అక్కడ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. సుమారు రూ. 2,600 చెల్లిస్తే 30 రోజుల పాటు అక్కడ తిరగవచ్చు. డబ్బు ఉంటే లోకం చుట్టేయొచ్చు అంటారు. కానీ ఆ డబ్బుతో ఇలాంటి మండప రిసార్ట్‌లో ఒక్క రోజైనా గడిపితే ఆ రాజభోగం ఏంటో అర్థమవుతుంది. బడ్జెట్ కాస్త ఎక్కువే అయినా, లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డెస్టినేషన్..

Follow Us