AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మై లైఫ్.. మై ఫ్యామిలీ.. ఐ లవ్‌ మై డాటర్‌.. బిడ్డకు విడాకులు.. తండ్రి ఏం చేశాడో తెలుసా..?

పెళ్లి, విడాకులు. రెండు భిన్నమైన సందర్భాలు. పెళ్లి అంటే బాజాలు, భజంత్రీలు, ఆనందాలు. కానీ విడాకులు తీసుకుంటే, ఇవేమీ ఉండవు. పెళ్లి తర్వాతి జీవితం కన్నీళ్లు మిగిల్చితే, విడాకులు తీసుకోవడం సంతోషమే ఇస్తుంది. అందుకే ఒక న్యాయమూర్తి తన కూతురి విడాకులను పండగలా చేశాడు.

మై లైఫ్.. మై ఫ్యామిలీ.. ఐ లవ్‌ మై డాటర్‌.. బిడ్డకు విడాకులు.. తండ్రి ఏం చేశాడో తెలుసా..?
Meerut Divorce
Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2026 | 12:42 PM

Share

పెళ్లి, విడాకులు. రెండు భిన్నమైన సందర్భాలు. పెళ్లి అంటే బాజాలు, భజంత్రీలు, ఆనందాలు. కానీ విడాకులు తీసుకుంటే, ఇవేమీ ఉండవు. పెళ్లి తర్వాతి జీవితం కన్నీళ్లు మిగిల్చితే, విడాకులు తీసుకోవడం సంతోషమే ఇస్తుంది. అందుకే ఒక న్యాయమూర్తి తన కూతురి విడాకులను పండగలా చేశాడు. ఉత్తరప్రదేశ్ (యూపీ) లోని మీరట్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జ్‌ జ్ఞానేంద్ర శర్మ తన కూతురు ప్రణీత విడాకులు పొందగానే, కోర్టు బయట సందడి చేశారు.

ఢోల్‌, నగాడా చప్పుళ్లతో ఇంటికి తీసుకెళుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి, చర్చనీయాంశంగా మారాయి. అంతేగాదు, కోర్టు బయట అందరికీ లడ్డూలు పంచారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు ధరించిన టీషర్ట్‌లు కూడా హైలైట్‌ అవుతున్నాయి. ఐ లవ్‌ మై డాటర్‌, మై హార్ట్‌, మై సోల్‌ అని రాసి ఉన్న టీ షర్ట్‌లు ధరించారు. అటు విడాకులు తీసుకున్న ప్రణీత కూడా “మై ఫ్యామిలీ, మై లైఫ్‌” అని రాసి ఉన్న టీ షర్ట్‌ ధరించారు.

విడాకులు తీసుకోవడం తనకు సరదా కాదన్నారు ప్రణీత. తాను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, విడాకుల దాకా వ్యవహారం పోకుండా ఉండటానికి ప్రయత్నించానని చెప్పారామె. కానీ పరిస్థితులు మాత్రం విడాకులకు దారి తీశాయనీ, 2021లో ఈ ప్రక్రియ మొదలైందని చెప్పారు..

వీడియో చూడండి..

అటు ఆమె తండ్రి, రిటైర్డ్‌ న్యాయమూర్తి జ్ఞానేంద్ర శర్మ కూడా తన కూతురికి అండగా నిలిచారు. తన బిడ్డ పుట్టినపుడు ఢోలక్‌ వాయించామనీ, మళ్లీ ఇప్పుడు అలాగే ఢోలక్‌ వాయించామనీ చెప్పారు.. తన బిడ్డ ఏ దశలో ఉన్నా, ఆమెకు తాము ఇస్తున్న విలువ మారదని చెప్పడానికి ఇలా ఢోలక్‌ వాయిస్తున్నట్లు జస్టిస్‌ జ్ఞానేంద్ర శర్మ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!