AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారనున్న ప్రపంచ పటం..! ఇప్పుడు భూమి మీద 7 కాదు, 8 ఖండాలు ఉన్నాయని మీకు తెలుసా..?

ఈ భూమిపై చాలా అద్భుతమైన ద్వీపాలు, ఖండాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాటి అందానికి ప్రసిద్ధి చెందాయి. కానీ మీకు తెలుసాఈ భూమిపై బిలియన్ల సంవత్సరాలుగా ఒక ఖండం ఎవరి దృష్టిలో పడకుండా ఉంది. ఇప్పటివరకు దానిని ఎవరూ చూడలేదంటే నమ్మగలరా..? అవును.. శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక ఆసక్తికరమైన, చారిత్రాత్మక ఆవిష్కరణ ఇది. ఈ ద్వీపం భూమి భౌగోళిక స్వరూపాన్నే మార్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మారనున్న ప్రపంచ పటం..! ఇప్పుడు భూమి మీద 7 కాదు, 8 ఖండాలు ఉన్నాయని మీకు తెలుసా..?
Researchers discover new land
Jyothi Gadda
|

Updated on: May 01, 2025 | 1:54 PM

Share

భూమిపై మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయని చిన్నప్పటి నుండి మనందరం చదువుకున్న విషయమే. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. కానీ ఈ జాబితా ఇప్పుడు మారిపోనుంది.! ఎందుకంటే శాస్త్రవేత్తలు గ్రీన్లాండ్ మంచు పలక కింద దాగి ఉన్న ‘సూక్ష్మ ఖండం’ ఒకటి కనుగొన్నారు. ఇది కెనడా, గ్రీన్లాండ్ మధ్య డేవిస్ స్ట్రెయిట్ అనే సముద్ర ప్రాంతంలో కనుగొనబడింది.

ఈ తెలియని ఖండాన్ని డేవిస్ స్ట్రెయిట్ ప్రోటో మైక్రోకాంటినెంట్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతం దాదాపు 58 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదని చెబుతున్నారు. గ్రీన్లాండ్, కెనడా మధ్య టెక్టోనిక్ ప్లేట్లు విడిపోతున్నాయి. కానీ,ఈ ఖండం పూర్తిగా విడిపోలేకపోయింది. దాంతో సముద్రపు లోతుల్లో మంచు పలక కింద ఈ ఖండం అలాగే దాక్కుంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రాంతాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇంత పెద్ద భూభాగంలో ఒక రకమైన ఖండం అక్కడ చాలా సంవత్సరాలుగా అంతర్లీనంగా దాగి ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

ఈ అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. పరిశోధకులు దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఆవిష్కరణ భౌగోళిక శాస్త్రం, భూమి చరిత్రపై మన అవగాహనను మారుస్తుందని మాత్రం శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..