Viral Video: వలకు చిక్కిన అరుదైన అద్భుతం.. ఏంటని పైకి లాగి చూడగా కళ్లు జిగేల్!
చేపల వేట కొందరికి సరదా.. మరికొందరికి జీవన భృతి.. మత్స్యకారులకైతే అదే వృత్తి. సముద్రంలోకి ఒక్కసారి చేపల వేటకు వెళ్లారంటే.. వారికి కొన్నిసార్లు తిరిగొచ్చేసరికి వారం పట్టొచ్చు.. లేదా నెల పడుతుంది. కానీ కచ్చితంగా బోలెడన్ని చేపలను తీసుకొస్తేనే.. జాలర్ల బ్రతుకు బండి ముందుకు కదులుతుంది.

చేపల వేట కొందరికి సరదా.. మరికొందరికి జీవన భృతి.. మత్స్యకారులకైతే అదే వృత్తి. సముద్రంలోకి ఒక్కసారి చేపల వేటకు వెళ్లారంటే.. వారికి కొన్నిసార్లు తిరిగొచ్చేసరికి వారం పట్టొచ్చు.. లేదా నెల పడుతుంది. కానీ కచ్చితంగా బోలెడన్ని చేపలను తీసుకొస్తేనే.. జాలర్ల బ్రతుకు బండి ముందుకు కదులుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్కడ గాలమేసినా, వల విసిరినా ఓ వింత చేపో, అరుదైన జలపుష్పమో, లేక వింత వస్తువో దొరుకుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదొకటి దొరుకుతూ హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఇక ఇటీవల గుజరాత్‌లో ఓ వింత వస్తువు సముద్రంలో జాలర్ల వలకు చిక్కింది.
వివరాల్లోకి వెళ్తే.. భరూచ్‌లోని కవి కాంబోయి సమీపాన సముద్రతీరంలో భారీ శివలింగాన్ని కనుగొన్నారు కొందరు మత్స్యకారులు. సముద్రంలో చేపలు పట్టే సమయంలో మత్స్యకారుల వలకు చిక్కింది ఈ అరుదైన శివలింగం. అనంతరం ఈ భారీ శివలింగాన్ని అతి కష్టం మీదకు ఒడ్డుకు చేర్చారు మత్స్యకారులు. ఈ శివలింగం చూడటానికి స్తంభేశ్వర్ మహాదేవ్ శివలింగం మాదిరిగా పొడవుగా, అత్యంత బరువుగా ఉన్నట్టు మత్స్యకారులు పేర్కొన్నారు. కాగా, ఈ వార్త స్థానికంగా క్షణాల్లో వైరల్ కావడంతో.. శివలింగాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఈ శివలింగాన్ని రెండు పడవలలో సుమారు 10 మంది అతికష్టం మీద ఒడ్డుకు తీసుకురాగలిగారు.
