Viral Video: అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
సాధారణంగా పాములు, అనకొండలను దూరం నుంచి చూస్తే చాలు దడుసుకుని చస్తాం. అలాంటిది మన దగ్గరకు వస్తే...
సాధారణంగా పాములు, అనకొండలను దూరం నుంచి చూస్తే చాలు దడుసుకుని చస్తాం. అలాంటిది మన దగ్గరకు వస్తే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల నాగు పాములు, కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ పాములకు సంబంధించిన సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక రెస్టారెంట్‌లో అటకపై దాక్కుంది ఓ భారీ అనకొండ.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
థాయిలాండ్‌లోని ఫిట్సన్‌లోక్ నగరంలో ఓ రెస్టారెంట్ టాయిలెట్ పైకప్పులో కొండ చిలువ దూరి దాక్కుంది. అది ఎప్పుడు దూరిందో ఎవరికీ తెలియదు… అటకపైన ఏదో కదులుతున్న శబ్దం రావడంతో ఏ పిల్లో ఎలుకల కోసం దూరి ఉంటుందని అనుకున్నారు అందరూ.. కానీ… తర్వాత కొండ చిలువను చూసి షాకయ్యారు. వెంటనే రెస్క్యూ టీమ్‌కి కాల్ చేశారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ రెస్టారెంట్‌లోని అటక డోర్ ఓపెన్ చేసి కొండచిలువను బటయకు లాగారు.
మొదట అది చిన్నదే అని అనుకున్నారు. అయితే అది లాగేకొద్దీ వస్తూనే ఉంది. బయటపడ్డాక గానీ తెలియలేదు అంత భారీ అనకొండను నెత్తిమీద పెట్టుకున్నామని రెస్టారెంట్ సిబ్బందికి. సాధారణంగా కొండచిలువలు నెమ్మదిగా ఉంటాయి. ఇక్కడ మాత్రం అది రెస్క్యూ టీమ్‌పై తిరగబడింది. వారిని కరవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ… వారు వెనకడుగు వెయ్యకుండా దాన్ని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!