Video: వామ్మో.. కొండచిలువ కాటేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా?
ఒక పాము పట్టుకొనే నిపుణుడు భారీ కొండచిలువను పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యాడు. కొండచిలువ అతని చెంపపై దాడి చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా కొండచిలువలు చుట్టుకుని చంపుతాయి కానీ ఈ సారి కాటు వేసింది.

సాధారణంగా కొండచిలువలు జంతువులు, మనుషులపై దాడి చేసే సమయంలో అవి బలంగా చుట్టుకుంటూ ఉంటాయి. అలా చుట్టుకుని ప్రాణాలు తీసి.. ఆ తర్వాత మింగే ప్రయత్నం చేస్తాయి. కానీ కొండచిలువ కాటు వేయడం ఎప్పుడైనా చూశారా? అది కాటేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఓ వ్యక్తి ప్రత్యక్షంగా అనుభవించాడు. పైగా అతను సాధారణ వ్యక్తి కాదు పాములు పట్టడంతో దిట్ట. అయినా కూడా కొండచిలువ కాటుకు గురయ్యాడు. దాదాపు ఒక నిమిషం పాటు కొండచిలువ కాటు వేసింది. వింటుంటేనే ఒళ్లు జలదరించేలా ఉన్న ఘటన నిజంగా జరిగింది.
వైరల్ అవుతున్న ఓ వీడియోలో చేతి తొడుగులు ధరించిన ఒక వ్యక్తి భారీ కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పెద్ద పామును పట్టుకోవడానికి గ్రామస్తులు ప్రొఫెషనల్ పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. మొత్తానికి ఆ వ్యక్తి ఎంతో కష్టపడి కొండచిలువను పట్టుకున్నాడు. మరొకరు దాని తోకను పట్టుకుని ఉన్నారు. కానీ పాములు పట్టే వ్యక్తి కొండచిలువ మెడను పట్టుకోవడానికి సిద్ధమవుతుండగా, కోపంగా ఉన్న పాము అకస్మాత్తుగా అతని చెంపపై దాడి చేసింది. ఇది చూసి, అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోయారు.
తరువాత ఏదో విధంగా ప్రజలు కొండచిలువ బారి నుండి పాములు పట్టే వ్యక్తిని విడిపించారు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేకపోయనప్పటికీ.. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
