AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్ని ఆవేశం తగలెయ్యా.! పోలీస్‌తోనే గొడవ పడ్డాడు.. సీన్ కట్ చేస్తే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో అందరి ఇప్పుడు ఈ వీడియో గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక గొడవలో ఓ యువకుడి పై పోలీసు కాల్పులు జరిపాడు.

Viral Video: ఓర్ని ఆవేశం తగలెయ్యా.! పోలీస్‌తోనే గొడవ పడ్డాడు.. సీన్ కట్ చేస్తే..
Punjab
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2022 | 12:02 PM

Share

viral video: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో అందరి ఇప్పుడు ఈ వీడియో గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక గొడవలో ఓ యువకుడి పై పోలీసు కాల్పులు జరిపాడు. డేరా బస్సీలోని హబెత్‌పూర్ గ్రామంలో ఓ కుటుంబాన్ని పోలీసుసిలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త తీవ్రం కావడంతో ఘర్షణకు దారి తీసింది. డేరా బస్సీలోని హబెత్‌పూర్ గ్రామంలో జరిగిన గొడవలో ఓ యువకుడిపై పంజాబ్ పోలీసు కాల్చాడు. ఈ సంఘటన మొత్తాన్ని కెమెరాలో బంధించారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను బీజేపీ యువజన విభాగం జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గాతో సహా పలువురు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పోలీసులు వాగ్వాదం జరుగుతుండగా ఓ యువతి పై పోలీసు చేయిచేసుకున్నాడు. బాధితుడు మరో ఇద్దరితో కలిసి ఏదో సమస్యపై తీవ్రస్థాయిలో మాట్లాడటం మనం చూడొచ్చు. ఇంతలో ఆ ముగ్గురూ పోలీసుపై దాడి చేయడం మొదలు పెట్టారు. యూనిఫాంలో ఉన్న వ్యక్తి  ఓ యువకుడి పై గన్ తో కాల్చాడు. దాంతో అతడి తొడ భాగంలో బుల్లెట్ దిగింది. నొప్పితో అతడు విలవిలలాడిపోయాడు. అనంతరం మిగిలిన యువతులు ఆ పోలీసు పై దాడి చేశారు. ‘మేము హెబత్‌పూర్ రోడ్డులో నిలబడి ఉండగా ఒక పోలీసు వచ్చి మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారు నా భార్య బ్యాగ్‌ని తనిఖీ చేయాలనుకున్నారు. వారు మద్యం సేవించి, నా సోదరుడిపై కాల్పులు జరిపారు” అని బాధితురాలి సోదరుడు అక్షయ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి