ఫోటోకి పోజిస్తూ.. నదిలో పడిన జంట. వీడియో వైరల్

తిరువనంతపురం: పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం.ఇక ఆ మరపురాని క్షణాలను కొంతమంది జీవితాంతం పదిలంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వీడియోలు తీసుకుంటే.. మరికొందరు ఫోటో షూట్స్ చేయించుకుంటారు. ఇక అలాంటి ప్రయత్నం చేసిన ఒక జంట.. ఆ ప్రయత్నం వికటించడంతో బొక్కబొర్లాపడింది. నది తీరంలో షూట్ .. బోల్తా కేరళకు చెందిన తిజిన్, శిల్పల పెళ్లి వచ్చే నెల 6న జరగనుంది. ఇక వారిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. […]

ఫోటోకి పోజిస్తూ.. నదిలో పడిన జంట. వీడియో వైరల్
Ravi Kiran

|

Apr 19, 2019 | 8:35 PM

తిరువనంతపురం: పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం.ఇక ఆ మరపురాని క్షణాలను కొంతమంది జీవితాంతం పదిలంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వీడియోలు తీసుకుంటే.. మరికొందరు ఫోటో షూట్స్ చేయించుకుంటారు. ఇక అలాంటి ప్రయత్నం చేసిన ఒక జంట.. ఆ ప్రయత్నం వికటించడంతో బొక్కబొర్లాపడింది.

నది తీరంలో షూట్ .. బోల్తా

కేరళకు చెందిన తిజిన్, శిల్పల పెళ్లి వచ్చే నెల 6న జరగనుంది. ఇక వారిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. రొటిన్‌కు భిన్నంగా ఉండాలని ఆ షూట్ ను నదిలో ప్లాన్ చేశారు. పంబా నదీ తీరంలో ఫొటోలు తీసుకుంటూ పడవలో కూర్చున్నారు. వెడ్డింగ్ షూట్ నిర్వాహకులు చెప్పినట్లు పోజిస్తున్నారు. అంతా బాగుందని అనుకునేలోపే పడవ బ్యాలన్స్ తప్పింది. అంటే కాబోయే పెళ్లికూతురు, పెళ్లికొడుకు నీళ్లలో పడిపోయారు. వెంటనే తేరుకున్న తిజిన్ .. శిల్పాను బయటకు తీసుకొచ్చారు.

నెట్టింట్లో ఈ వీడియో వైరల్

తిజిన్, శిల్ప ప్రీ వెడ్డింగ్ షూట్‌ను వెడ్ ప్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది యువత తెగ చూసేసి .. కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే 3.31 లక్షల మంది వీక్షించారు. తాజాగా ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

https://www.facebook.com/WeddplannerWeddingStudio/videos/1596808883782488/

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu