నా డ్యూటీ అయిపోయింది.. ట్రైన్ నడపను

తన డ్యూటీ ముగిసిపోయిందంటూ మార్గ మధ్యంలోనే గూడ్స్‌ రైలును ఆపేశాడు ఓ లోకో పైలెట్. ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో జరిగింది. శుక్రవారం ఉదయం బొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగిపోయింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజు కిందకు దిగాడు. తన డ్యూటీ సమయం అయిపోయిందని, వేరే లోకో పైలెట్ రాలేదని.. తాను ఈ […]

నా డ్యూటీ అయిపోయింది.. ట్రైన్ నడపను
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 11:29 AM

తన డ్యూటీ ముగిసిపోయిందంటూ మార్గ మధ్యంలోనే గూడ్స్‌ రైలును ఆపేశాడు ఓ లోకో పైలెట్. ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో జరిగింది. శుక్రవారం ఉదయం బొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగిపోయింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజు కిందకు దిగాడు. తన డ్యూటీ సమయం అయిపోయిందని, వేరే లోకో పైలెట్ రాలేదని.. తాను ఈ రైలును ముందుకు నడపనని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమయ్యాడు.

దీంతో శీర్గాలి- పుంగనూరు మార్గంలో సుమారు గంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందకున్న రైల్వే అధికారులు ముత్తురాజుతో మాట్లాడి మైలాడుదుర్ జంక్షన్ వరకు గూడ్స్ నడపాలని కోరారు. దీంతో ఎట్టకేలకు ఒప్పుకున్న ముత్తురాజు గూడ్స్‌ను ముందుకు కదిలించాడు. అయితే ఈ చర్యతో వాహనదారాలు పలు ఇబ్బందులు పడ్డారు.