AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదీ ఓంకార మహిమ అంటే.. తన చిన్నారి ఏడుపు ఆపడానికి ఓంకారాన్ని పఠించిన తల్లి.. వీడియో వైరల్

ఓంకారం శక్తి, అద్భుతమైన ప్రయోజనాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. విదేశీయులు కూడా తమ పిల్లల ఏడుపును ఆపడానికి ఓంకారాన్ని జపిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో తన బిడ్డ ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపకపోవడంతో తల్లి ఓంకారాన్ని జపించింది. ఓంకార నాదం విన్న పాప వెంటనే ఏడుపు ఆపి శాంతించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇదీ ఓంకార మహిమ అంటే.. తన చిన్నారి ఏడుపు ఆపడానికి ఓంకారాన్ని పఠించిన తల్లి.. వీడియో వైరల్
Power Of Omkar
Surya Kala
|

Updated on: May 22, 2024 | 7:30 PM

Share

హిందూ సంస్కృతిలో ఓంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సృష్టికి మూలం ఓంకారం అని నమ్మకం. ప్రతి వేద మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓంకారాన్ని జపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాదు మానసిక ఏకాగ్రత పెరిగి మనసుకు ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా ఓంకారం శక్తి, అద్భుతమైన ప్రయోజనాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. విదేశీయులు కూడా తమ పిల్లల ఏడుపును ఆపడానికి ఓంకారాన్ని జపిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో తన బిడ్డ ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపకపోవడంతో తల్లి ఓంకారాన్ని జపించింది. ఓంకార నాదం విన్న పాప వెంటనే ఏడుపు ఆపి శాంతించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో @hushaar_giraki అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “ఓంకార వైభవాన్ని చూడండి.. మన భారతదేశం మన గర్వకారణం” అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

వైరల్ అయిన వీడియోలో ఒక చిన్నారి బాలుడు బిగ్గరగా ఏడుస్తున్నాడు. తల్లి ఏం చేసినా పాప ఏడుపు ఆపలేదు. దీంతో తల్లి తర్వాత ఓంకారాన్ని జపించింది. ఓంకార నాదం వినగానే ఆ పిల్లవాడు వెంటనే ఏడుపు ఆపి ప్రశాంతత పొందాడు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు లక్షన్నరకు పైగా వ్యూస్ రావడంతో ఈ అద్భుత దృశ్యం వీక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..