AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరాధ్య దైవం పవన్ ఆశీస్సులతో…అంటూ పెళ్లికార్డు

పవన్ వీరాభిమాని తన పెళ్లి కార్డుపై జనసేన మేనిఫెస్టోతో పాటూ పార్టీ గుర్తు గాజు గ్లాసును…పవన్ ఫోటోను కూడా ముద్రించాడు. పవన్ ఆశీస్సులతో తన వివాహానికి బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానించాడు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్తవలసకు చెందిన శ్రావణ్‌కుమార్ పవన్ అభిమాని జనసేన పార్టీ కార్యకర్త. ఈ నెల 20న శ్రావణ్ వివాహానికి ముహూర్తం కుదరగా.. తన పెళ్లి కార్డులో పవన్‌పై ఉన్న అభిమానాన్ని […]

ఆరాధ్య దైవం పవన్ ఆశీస్సులతో...అంటూ పెళ్లికార్డు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2019 | 2:41 PM

Share

పవన్ వీరాభిమాని తన పెళ్లి కార్డుపై జనసేన మేనిఫెస్టోతో పాటూ పార్టీ గుర్తు గాజు గ్లాసును…పవన్ ఫోటోను కూడా ముద్రించాడు. పవన్ ఆశీస్సులతో తన వివాహానికి బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానించాడు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్తవలసకు చెందిన శ్రావణ్‌కుమార్ పవన్ అభిమాని జనసేన పార్టీ కార్యకర్త. ఈ నెల 20న శ్రావణ్ వివాహానికి ముహూర్తం కుదరగా.. తన పెళ్లి కార్డులో పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘నా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అంటూ కార్డు కవర్‍పై ముద్రించాడు. కార్డు వెనుక వైపు మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ 12 హామీలను ప్రస్తావించాడు. పవన్ ఫోటోను కూడా తన కార్డులో ముద్రించాడు. ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిచూసి జనసైనికులు తెగ సంబరపడిపోతున్నారు.

Follow Us