Optical illusions: కాస్కోండి అసలైన పజిల్.. ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది, కనిపెట్టగలరా.? మీ బ్రెయిన్‌కు పదును పెట్టగలరా.?
పజిల్స్ కేవలం టైమ్‌పాస్ కోసం మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టేలా ఉంటాయి. ఈ పజిల్స్‌ను సాల్వ్ చేసే క్రమంలో బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది. అందుకే చిన్నారుల్లో ఆలోచన శక్తిని పెంచడానికి ఇలాటి పజిల్స్‌ను ఇస్తుంటారు. ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌కు పరిమితమైన..
పజిల్స్ కేవలం టైమ్‌పాస్ కోసం మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టేలా ఉంటాయి. ఈ పజిల్స్‌ను సాల్వ్ చేసే క్రమంలో బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది. అందుకే చిన్నారుల్లో ఆలోచన శక్తిని పెంచడానికి ఇలాటి పజిల్స్‌ను ఇస్తుంటారు. ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌కు పరిమితమైన ఇలాంటి పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాకు విస్తరించాయి. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి.
ఫొటోలో దాగున్న వస్తువులను కనుగొనండి అంటూ, లేదా ఫొటోలో ఉన్న తప్పును గుర్తించండి అంటూ కొన్ని ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పైన కనిపిస్తోన్న ఫొటోలో ఓ వ్యక్తి హాల్‌లో కూర్చొని టీవీ చూస్తున్నాడు కదూ.! అతనితో పాటు అక్కడ రెండు పిల్లిలు ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది కనిపెట్టారా.?
ఏంటీ ఎంత సెర్చ్ చేసినా తప్పు కనిపించడం లేదా.? తీక్షణంగా గమనిస్తే కానీ ఆ తప్పును మీరు పట్టుకోలేరు. సహజంగా టేబుల్‌కు ఎన్ని కాళ్లు ఉంటాయి.? ఏముంది నాలుగు అంటారా.? మరి పైన ఫొటోలో ఉన్న టేబుల్‌కు ఎన్ని కాళ్లు ఉన్నాయో ఓసారి చూడండి. మూడు ఉన్నాయి కదూ! అవును ఈ ఫొటోలో ఉన్న తప్పు ఇదేనండి. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కు పంపించి వారికి కూడా సవాల్ విసరండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..