Optical illusions: సవాలను స్వీకరించే సత్తా మీకుందా.? అయితే ఈ ఫొటోలో దాగున్న కుందేలును కనిపెట్టండి చూద్దాం.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు సోషల్ మీడియాలో విహరిస్తున్న రోజులివీ. క్షణం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి దూరిపోతున్నారు. అయితే సోషల్ మీడియా కేవలం టైంపాస్‌కి మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టే విషయాలను..

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు సోషల్ మీడియాలో విహరిస్తున్న రోజులివీ. క్షణం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి దూరిపోతున్నారు. అయితే సోషల్ మీడియా కేవలం టైంపాస్‌కి మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టే విషయాలను కూడా అందిస్తోంది. ముఖ్యంగా మనిషి ఐక్యూను, పరిశీలన శక్తిని పరీక్షించే ఆప్టికల్ ఇల్యూజన్ ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఇలా రోజుకో కొత్త ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
పైన ఫొటో చూస్తుంటే ఓ వ్యక్తి వేటకు బయలు దేరినట్లు కనిపిస్తోంది కదూ. చేతిలో గన్, తలకు టోపీ పెట్టుకున్న ఆ వేటగాడికి తోడుగా ఓ కుక్క కూడా ఉంది. అయితే అతను ఆ అడవిలో ఉన్న కుందేలును వేటాడాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ కుందేలు మాత్రం అతనికి కనిపించకుండా నక్కి ఉంది. ఆ నక్కి ఉన్న కుందేలును కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఉద్దేశం.



మరి మీకు ఆ కుందేలు కనిపించిందా.? అయితే కుందేలును 10 సెకన్లలో గుర్తిస్తే మీ పరిశీలన శక్తికి ఎదురే లేదని చెప్పొచ్చు. అయితే కుందేలును కనిపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఆప్టికల్ ఇల్యూజన్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి అంత సులభంగా కనిపించకుండా డిజైన్ చేశాడు. ఫొటోలో వెనకాల ఓ చెట్టు ఉంది కనిపిస్తోందా.? దాని పక్కనే కుందేలు నిల్చొని చూస్తోంది . ఒకవేళ మీకు ఇప్పటికే సమాధానం దొరక్కపోతే కింద ఇచ్చిన ఫొటోను చూడండి. రెడ్ సర్కిల్‌లో కుందేలు కనిపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..