Cashew Nuts: ఆ గ్రామంలో కూరగాయలకంటే తక్కువ ధరకే జీడిపప్పు.. క్యాషూ సిటీ ఆఫ్‌లో రోడ్డుపక్కనే అమ్మకం..

|

May 07, 2023 | 1:15 PM

జీడిపప్పు తింటే రోగ నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మరి దీని ధరకూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కేజీ జీడిపప్పు కొనాలంటే ఎనిమిది వందలనుంచి 1200 రూపాయలవరకూ ఉంటుంది. మరి ఇది అందరికీ సాధ్యం కాదు కదా. కానీ ఇంతటి ఖరీదైన ఈ జీడిపప్పు కేజీ కేవలం 15 రూపాయలకే దొరుకుతుంది.

Cashew Nuts: ఆ గ్రామంలో కూరగాయలకంటే తక్కువ ధరకే జీడిపప్పు.. క్యాషూ సిటీ ఆఫ్‌లో రోడ్డుపక్కనే అమ్మకం..
Cashew Nut
Follow us on

ఆరోగ్యంగా ఉండేందుకు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం చాలామంచింది. వీటిలో ముందు వరుసలో ఉండేది జీడిపప్పు. దీనిని పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ జీడిపప్పు తింటే రోగ నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మరి దీని ధరకూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కేజీ జీడిపప్పు కొనాలంటే ఎనిమిది వందలనుంచి 1200 రూపాయలవరకూ ఉంటుంది. మరి ఇది అందరికీ సాధ్యం కాదు కదా. కానీ ఇంతటి ఖరీదైన ఈ జీడిపప్పు కేజీ కేవలం 15 రూపాయలకే దొరుకుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఝార్ఖండ్‌లోని నాలా అనే గ్రామంలో జీడిపప్పు అతి తక్కువ ధరకు దొరుకుతుంది. ఎంత తక్కువ అంటే కేజీ జీడిపప్పు 15 నుంచి 40 రూపాయల లోపే ఉంటుంది. మన దగ్గర రోడ్ల పక్కన గంపల్లో పండ్లూ, కూరగాయలూ అమ్మినట్టు- అక్కడ జీడిపప్పును అమ్ముతుంటారు. ఇంత తక్కువ ధరకు జీడిపప్పు దొరికితే ఎవరు వదులుతారు చెప్పండి. అందుకే ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు ఇక్కడికి వచ్చి చౌకగా జీడిపప్పు కొంటుంటారు. అందుకే ఆ ఊరు ‘క్యాషూ సిటీ ఆఫ్‌ ఝార్ఖండ్‌’గా పేరుపడింది. అదిసరే… అంత ఖరీదైన జీడిప్పు ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారనేది అందరికి వచ్చే సందేహం..

దీనికో కారణం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ గ్రామంలో సరిగా పంటలు పండేవి కావట. దాంతో పొలాలు బీడు భూములుగా మారిపోయాయట. అది గమనించిన అటవీశాఖ అధికారులు 2010లో భూసార పరీక్షలు నిర్వహించారట. ఆ పరీక్షల్లో ఆ ప్రాంతం జీడి పంటలకు అనువైందని తేలిందట. అప్పట్నుంచీ రైతులకు ఉచితంగా జీడి గింజలు ఇచ్చి సాగు చేయిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. 50 ఎకరాల విస్తీర్ణంలో మొదలైన జీడితోటలు సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో… ఆ గ్రామ ప్రజలు వాటిని ఊళ్లోనే అమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడ నాణ్యమైన జీడిపప్పునే కాదు, పచ్చి జీడికాయలను కూడా విక్రయిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రేండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..