Viral Video: 39 వారాల గర్భంతో చీరకట్టులో ‘చక్రాసనం’.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్న మహిళ!
ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఒక మహిళ చేసిన సాహసోపేతమైన యోగా వీడియో సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. ఆమె ఏకంగా 39 వారాల గర్భవతి. ప్రసవానికి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో, ఆమె చీర కట్టుకుని చేసిన కష్టమైన యోగాసనాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

బెంగళూరుకు చెందిన యోగా టీచర్ శశి ప్రభా ద్వివేది, ఈ వైరల్ వీడియోలో అందమైన ఆకుపచ్చ చీరలో కనిపించారు. నిండు గర్భిణీ అయిన మహిళలు సాధారణంగా నడవడమే కష్టంగా భావిస్తారు. కానీ శశి ప్రభ మాత్రం అత్యంత కష్టమైన ‘చక్రసనం’ వంటి ఆసనాలను ఎంతో సునాయాసంగా, ముఖంపై చిరునవ్వుతో చేస్తూ కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చలు మొదలుపెట్టారు.
కొందరు ఆమె ధైర్యాన్ని, ఫిట్‌నెస్‌ను ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసమే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని, ఇది పుట్టబోయే బిడ్డ ప్రాణానికే ముప్పని విమర్శకులు మండిపడుతున్నారు. శరీరం సహకరిస్తే గర్భధారణలో యోగా చేయడం తప్పు కాదని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.
తనపై వస్తున్న విమర్శలపై శశి ప్రభా ద్వివేది స్పందించారు. “ఇది ఒక రోజులో వచ్చింది కాదు. సంవత్సరాల తరబడి చేసిన కఠోర శ్రమ, సాధన, శరీరంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. నేను ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది నా జీవనశైలి” అని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఇతర మహిళలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. “ప్రతి మహిళ గర్భధారణ కాలం భిన్నంగా ఉంటుంది. దయచేసి నా వీడియోను చూసి బ్లైండ్‌గా కాపీ కొట్టే ప్రయత్నం చేయకండి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి వ్యూహామాలైనా, యోగాసనాలైనా చేసే ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని సంప్రదించండి” అని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..