Viral Video: కుటుంబ పెద్ద మ్యారేజ్ డేని వెరైటీగా జరుపుకున్న కుటుంబీకులు.. వీడియోను మీరూ చేసేయండి
Viral Video: భారతదేశాని(Bharath) కి చక్కని పునాది ఉమ్మడి కుటుంబాలు(Joint Family).. ప్రపంచ దేశాల్లో భారతీయుల కుటుంబ వ్యవస్థ ఒక ప్రత్యేకంగా నిలబెట్టింది. అయితే విద్య, ఉద్యోగం వంటి అవసరాలతో ఉమ్మడి..
Viral Video: భారతదేశాని(Bharath) కి చక్కని పునాది ఉమ్మడి కుటుంబాలు(Joint Family).. ప్రపంచ దేశాల్లో భారతీయుల కుటుంబ వ్యవస్థ ఒక ప్రత్యేకంగా నిలబెట్టింది. అయితే విద్య, ఉద్యోగం వంటి అవసరాలతో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి. అయినప్పటికీ బంధాలకు ఇప్పటికీ విలువ ఇస్తూనే ఉన్నారు. పండగలు, ఫంక్షన్లు, సెలవులు ఇలా ఏ సందర్భం వచ్చినా.. ఎక్కడ ఏ ఊరిలో ఉన్న ఫ్యామిలీ అంతా ఒకే చోటకు చేరుకుంటారు. అయినవారి మధ్య సంతోషంగా గడుపుతారు. తన వారికీ కష్టనష్టాలు ఎదురైనా అన్నీ తానై అండగా నిలబడతారు.. అది భారతీయ కుటుంబ వ్యవస్థకు ఉన్న గొప్పదనం. అయితే కాలంలో అన్నిటిలోను మార్పులు వచ్చినట్లు.. మనుషుల ఆలోచలో కూడా మార్పులు వచ్చాయి. మేము మాది నుంచి నేను నాది అనే నేచర్ పెరిగింది. అయినప్పటికీ అమ్మానాన్నకి తన పిల్లలంటే ప్రేమ.. పిల్లల పిల్లంటే మక్కువ.. తాజాగా భారతీయ కుటుంబ వ్యవస్థను భార్యాభర్తలుగా జీవిత ప్రయాణం మొదలు పెట్టి..షష్టిపూర్తి చేసుకునే సమయం వరకూ వారి జీవితంలో వచ్చిన మనుషుల గురించి తెలియజేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కొన్నింటికి భాష అక్కర్లేదు..భావం అర్ధం చేసుకుంటే చాలు.. ఈ వీడియో లోని విషయం గ్రహించండి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఓ వీడియో.. ఈ వీడియోలో ఇద్దరు పెద్దలు వివాహ వేడుక జరుపుకుంటున్నట్లు ఉన్నారు. ఇద్దరి పెద్దలు.. 1971 లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తర్వాత 1973, 75, 82, 86 సంవత్సరాల్లో నలుగురు కుమార్తెలకు తల్లిదండ్రులయ్యారు ఈ దంపతులు. పెద్ద కుమార్తెకు 1992 లో పెళ్లి చేశారు. ఈ దంపతులకు 1993 లో కుమార్తె పుట్టింది. దీంతో ఈ పెద్దవారు తాతయ్య అమ్మమ్మలుగా ప్రమోషన్ అందుకున్నారు. ఇలా తమ ఇంట్లో జరిగిన కుమార్తెలు పెళ్లి వేడుకలు.. అల్లుళ్ళు అడుగు పెట్టిన సంవత్సరాలలో పాటు.. కుమార్తెలకు పుట్టిన సంతానం.. మళ్ళీ మనవరాలికి పెళ్లి జరిపించిన సంవత్సరాలను ఈ వీడియోలో ఓ కార్డులతో ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి మరి:
China Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికుల దుర్మరణం..