Viral Video: ఓరి దేవుడా ఇదెక్కడి పిచ్చి.. పాము నోట్లో నాలుక పెట్టి..

సాధారణంగా పామును ఆమడ దూరంలో చూస్తేనే.. పరుగులు పెడతాం. పామును చూస్తేనే చాలా మందికి భయం. అదే విధంగా పామును దేవుడిగా కొలిచి పూజించే వాళ్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇలా ఎవరి వెర్షన్ వాళ్లదు. అయితే ఇంకొందరు మాత్రం పాముతో ఆటలు కూడా ఆడతారు. ఇంట్లో పాములను పెంచుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు..

Viral Video: ఓరి దేవుడా ఇదెక్కడి పిచ్చి.. పాము నోట్లో నాలుక పెట్టి..
Viral Video (1)
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 13, 2024 | 7:05 PM

సాధారణంగా పామును ఆమడ దూరంలో చూస్తేనే.. పరుగులు పెడతాం. పామును చూస్తేనే చాలా మందికి భయం. అదే విధంగా పామును దేవుడిగా కొలిచి పూజించే వాళ్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇలా ఎవరి వెర్షన్ వాళ్లదు. అయితే ఇంకొందరు మాత్రం పాముతో ఆటలు కూడా ఆడతారు. ఇంట్లో పాములను పెంచుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అవుతూ ఉంటాయి. పాములకు సంబంధించి ఎలాంటి వీడియోలు అయినా సరే క్షణాల్లో నెట్టింట జోరుగా వైరల్ అవుతాయి. తాజాగా పాముకు సంబంధించిన మరో వీడియో కూడా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. పులి నోట్లో తల పెట్టడ అనే సామెత గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి పాము నోట్లో నాలుక పెట్టడం కాస్త విచిత్రంగా ఉంది.

ఈ వీడియో చూస్తే.. ఒక అబ్బాయి పాముతో ఆడుతూ ఉంటాడు. పాము విషపూరితమైన జీవి. ఒక్క కాటు వేస్తే చాలు.. నరాల్లోకి విషం ఎక్కి.. గంటల్లోనే ప్రాణాలు కోల్పోతారు. పాముల్లో మరింత విష పూరితమైనవి కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఇతను పాము వెళ్తుండగా పట్టుకుని ఆడుతున్నాడు. కానీ పాము మాత్రం అది నచ్చక అతన్ని కాటు వేస్తుంది. ఆ తర్వాత మెల్లిగా పామును మచ్చిక చేసుకుంటూ.. పామును తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత తన నాలుకను బయటకు చాపాడు.

పాము నాలుకను టచ్ చేసే లోపు మళ్లీ లోపలికి నాలుకను పెట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ నాలుకను బయటకు చాపాడు. దీంతో పాము వ్యక్తి నాలుకను టచ్ చేసింది. అలా మరోసారి చేశాడు. ఈ వీడియో చూస్తుంటే.. పామును హిప్నటైజ్ చేస్తున్నట్లు.. పాము తను చెప్పింది చేయాలి అన్నట్టు వ్యక్తి ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఉంది. పాముతో ఇంత అవలీలగా ఆడేస్తున్నాడు అంటే.. పాముకు ఉన్న విషయం తీసేశారు అనుకుంట. ఏది ఏమైనా పాముతో ఇలాంటి భయంకరమైన ఆటలు ఆడకూడదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు కూడా భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by Anggara Shoji (@jejaksiaden)

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ