Mother Love: తల్లి మరణానంతరం కొడుక్కి తెలిసిన సంచలన నిజం.. కంటతడి పెట్టిస్తున్న వ్యక్తి ట్విట్టర్ పోస్ట్..

తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదు. తల్లి ప్రేమకు వెల కట్టలేం. తల్లి పేరు చెప్పగానే ఈ తనయుడైనా, కుమార్తే అయినా ఒకరమైన ప్రేమ, ఉద్వేగభరితమైన అనుభూతిని చెందుతారు. తల్లిని ప్రేమించని బిడ్డ ప్రపంచంలో ఉండడు. ఇక తల్లి లేని బాధ అత్యంత దారుణంగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

Mother Love: తల్లి మరణానంతరం కొడుక్కి తెలిసిన సంచలన నిజం.. కంటతడి పెట్టిస్తున్న వ్యక్తి ట్విట్టర్ పోస్ట్..
Mother Love
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 27, 2023 | 7:04 AM

తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదు. తల్లి ప్రేమకు వెల కట్టలేం. తల్లి పేరు చెప్పగానే ఈ తనయుడైనా, కుమార్తే అయినా ఒకరమైన ప్రేమ, ఉద్వేగభరితమైన అనుభూతిని చెందుతారు. తల్లిని ప్రేమించని బిడ్డ ప్రపంచంలో ఉండడు. ఇక తల్లి లేని బాధ అత్యంత దారుణంగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. తన తల్లి తనకు దూరమైనా.. ఆమె జ్ఞాపకాన్ని తలుచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన తల్లి మరణం తెలిసిన ఒక అద్భుతమైన నిజాన్ని గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

విక్రమ్ ఎస్. బుద్ధ నేషన్ తన దివంగత తల్లిని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్‌ను చేశారు. తన తల్లి వినియోగించిన 24 ఏళ్ల ప్లేట్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ప్లేట్ తన తల్లికి చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ తల్లి ఆ ప్లేట్‌ను అంతగా ఇష్టపడటం వెనుక హృదయం చలించిపోయే కారణం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేట్‌లో తినడానికి తన తల్లి తనను, తన మేనకోడలిని మాత్రమే అనుమతించేదని విక్రమ్ చెప్పాడు. అయితే, తన తల్లి మరణించిన తర్వాత.. ఇప్పటి వరకు తెలియని ఈ ‘ప్లేట్‌’కి సంబంధించిన కథ గురించి విక్రమ్‌కు తెలిసింది. 1999లో విక్రమ్ 7వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌లో బహుమతిగా ఈ ప్లేట్ అందుకున్నాడట. ఈ విషయాన్ని విక్రమ్‌కి తన సోదరి చెప్పింది. అప్పటి నుంచి గత 24 సంవత్సరాలుగా తన తల్లి ఆ ప్లేట్‌లోనే భోజనం చేసేది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు విక్రమ్.

తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా అంటూ విక్రమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. తల్లి ప్రేమను మించి ఈ లోకంలో ఏదీ లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..