AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పైకి చూసి కారు బోల్తాపడింది అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

మన బుర్రకు కాస్త పదునుపెడితే చాలు.. ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. దీనికి నిదర్శనంగా నిలిస్తూ సరికొత్త ఇన్వెన్షన్లను..

Viral Video: పైకి చూసి కారు బోల్తాపడింది అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Dec 30, 2022 | 12:09 PM

Share

మన బుర్రకు కాస్త పదునుపెడితే చాలు.. ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. దీనికి నిదర్శనంగా నిలిస్తూ సరికొత్త ఇన్వెన్షన్లను చేసిన చూపించినవాళ్లు ఎందరో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కార్లను వివిధ రకాల డిజైన్లలో రూపొందిస్తున్నారు. ప్రజలు మెచ్చుకునేలా కొందరు చేస్తుంటే.. మరికొందరు వాటి పనితీరును మెరుగుపరచడానికి అలా తయారు చేస్తున్నారు. కస్టమైజేషన్.. దీనిపైనే ఈ రోజుల్లో కార్లను ఇష్టపడేవారు, ఔత్సాహికులు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు. తమకు నచ్చిన విధంగా.. అందరినీ ఆకట్టుకునేలా కారులో మార్పులు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అసలేముందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

పైన పేర్కొన్న వీడియోపై ఓ లుక్కేయండి. మీకేం కనిపించింది.! ఏముంది.? ఓ కారు బోల్తాపడింది. ఇలానే అనుకున్నారు కదా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ కారు బోల్తాపడలేదండీ..! అదొక మోడల్ అంతే!.. కారును తలక్రిందులుగా రూపొందించారు. మొత్తానికి కింద ఉండాల్సిన నాలుగు టైర్లను పైకి వచ్చేలా సెట్ చేసి.. మహా గొప్పగా రూపొందించాడు ఆ ఇంజినీర్ ఎవడో.. చాలా సూపర్బ్ కదూ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి చూసేయండి. మీ కామెంట్స్ చెప్పేయండి..