‘నోట్ల రద్దు’ వల్ల ఒరిగింది ఏమి లేదు – ఆర్టీఐ

భారత దేశ చరిత్రలో చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మోదీ ‘డిమోనిటైజేషన్’.  చాలా రోజులు అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెబుతున్నానని మీరు అనుకుంటున్నారా. ఎందుకో ఒక్కసారి మీరు చదవండి తెలుస్తుంది. 2016 నవంబర్ 8 న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ భారత ప్రజానీకాన్నీ ఉద్దేశించి ఓ ప్రకటన చేసారు. నల్లధనం లో కూరుకుపోతున్న మన సమాజాన్ని కాపాడే దిశగా ‘డిమోనిటైజేషన్’  అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం అని చెప్పారు. […]

  • Ravi Kiran
  • Publish Date - 8:57 pm, Sat, 16 March 19
‘నోట్ల రద్దు’ వల్ల ఒరిగింది ఏమి లేదు - ఆర్టీఐ

భారత దేశ చరిత్రలో చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మోదీ ‘డిమోనిటైజేషన్’.  చాలా రోజులు అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెబుతున్నానని మీరు అనుకుంటున్నారా. ఎందుకో ఒక్కసారి మీరు చదవండి తెలుస్తుంది.

2016 నవంబర్ 8 న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ భారత ప్రజానీకాన్నీ ఉద్దేశించి ఓ ప్రకటన చేసారు. నల్లధనం లో కూరుకుపోతున్న మన సమాజాన్ని కాపాడే దిశగా ‘డిమోనిటైజేషన్’  అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం అని చెప్పారు. దీనితో పేరు మోసిన కోటీశ్వరులు, లక్షాధికార్లు, ఇతర పెద్ద వ్యాపారవేత్తలు, ఇంకా ఎందరో రానున్న ప్రమాదానికి సిద్దమైపోయారు. మరో పక్క అసలు అదేంటో ఎలా ఉండబోతుందో అర్థంకాని సామాన్య ప్రజానీకం అలా చూస్తూ ఉండిపోయారు.

పథకం అమలైపోయింది, అలాగే దాని ప్రభావం మొదలవడానికి ఎక్కువ సమయమేం పట్టలేదు. మరుసటి రోజున పెట్రోల్ బ్యాంకులు, ఎటిఎంలు, బ్యాంకులు ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు జనం తో కిక్కిరిసిపోయాయి.

ఆపై దేశవ్యాప్తంగా ఊహించని సంచలనాలెన్నో చోటు చేసుకున్నాయి. సామాన్య ప్రజలు అందరూ కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు పడి నోట్లు మార్చుకుంటే.. కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు ఎందరో మాత్రం దర్జాగా వారి ఇంటి దగ్గర నుండే తమ డబ్బుని మార్చుకున్నారు.

ఇక ఈ ‘నోట్ల రద్దు’ వ్యవహారం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మరో నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే విదేశీ బ్యాంకులలో కోటీశ్వరులు దాచుకున్న నల్ల డబ్బుని తీసుకొచ్చి సామాన్యులకు జన్ ధన్ యోజనా పధకం ప్రకారం ఆ డబ్బును ఖాతాలోకి వేస్తాం అని ప్రకటించారు. అయితే అలాంటి మంచి పరిణామాలు మాత్రం ఏమి జరగలేదు.

తాజాగా ఆర్టీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా నల్ల డబ్బు తిరిగి తీసుకురావడం కోసం మోదీ ప్రయోగించిన ‘నోట్లు రద్దు’ అస్త్రం ఏవిధంగానూ ఉపయోగపడలేదని అన్నారట.

ఆర్టీఐ యాక్ట్ క్రింద తెలిసిన వివరాలు ప్రకారం, నోట్ల రద్దు సమయంలో రెండు వివిధ రకాలతో ఉన్న పాన్ నెంబర్స్ కలిగిన అకౌంట్స్ ను గుర్తించారట. ఆ తరుణంలో అకౌంట్స్ లోకి ముందు కన్నా భిన్నంగా డబ్బు డిపాజిట్ జరిగిందట. ఇక 2017-18 గానూ ఇన్ కమ్ టాక్స్ లు కూడా సరిగ్గా కట్టని ఆ అకౌంట్ హోల్డర్స్ కు నోటీసులు పంపారట.

ఇకపోతే డిమోనిటైజేషన్ ముఖ్య ఉద్దేశం నల్ల ధనాన్ని అరికట్టడమే. బాగానే ఉంది, మోదీ గారు ఈ నిర్ణయం తీసుకున్న కొద్దీ రోజుల్లోగానే, ప్రభుత్వ అధికారులు ఊహించిన విధంగా కొద్ది మంది వ్యాపారవేత్తలపై, మరియు లక్షాధికార్ల పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దాని ఫలితంగా చాలా మంది నల్లకుబేరులు తమ దగ్గరున్న పెద్ద నోట్లని ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియక, కొందరేమో పాపం తమ ధనాన్ని సంచుల్లో మోసుకుపోయి నదులపాలు చెయ్యటానికి కూడా వెనకాడలేదు. మరి కొంతమంది తెలివిగల వారు..బంగారు రూపానో, మరో ఇతర మార్గానో సొమ్మును దాచుకోగలిగారు. అత్యంత తెలివి గల బడా బాబులు, వ్యాపార దిగ్గజాలు తమ తమ పథకాల అనుగుణంగా దేశాలు సైతం దాటించేసే ఉంటారు. ఇంకా చాలా మంది ప్రముఖులు మాత్రం అస్సలు మోదీ గారు అనౌన్స్ చేయకముందే, పరిస్థితులను ఊహించి.. తమ సొమ్ములని ముందే జాగ్రత్త పరుచుకున్నారని వార్తలు లేకపోలేదు..

అధికారులు తనీఖీలు చేసారు బాగానే ఉంది. ఏ నల్లధనం కూడా విదేశాల నుంచి రాలేదు గానీ.. ఇక్కడ ఉన్న బడా బాబులు మాత్రం చక్కగా నేరాలు చేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అప్పటి నుంచి ఇప్పటి వరకు సామాన్యుల కష్టాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. అంతేకాదు వృద్ధి శాతం కూడా బాగా పడిపోయింది  అని వినికిడి. ఏటీఎమ్ లలో డబ్బు తగ్గిపోయింది.. బ్యాంకులు అమాంతం పన్నులు పెంచేశాయి.. అకౌంట్ లో క్యాష్ లేకపోతే భారీగా ఫైన్స్ సామాన్యులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నాయి. ఆ భయంతో సామాన్య ప్రజలు కష్టపడి  సంపాదించిన తమ డబ్బుని బ్యాంకులలో వెయ్యడం మానేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం వల్ల మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంత్రులందరూ వెనకేసుకొని వస్తున్నా.. దీని వల్ల ఒరిగింది ఏమి లేదనే చెప్పాలి.