AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎప్పుడూ రాజకీయాలేనా బ్రో.. ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేసిన ఎంపీ అర్వింద్‌. నెట్టింట వైరల్‌..

రాజకీయాల నాయకులంటే ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలు.. చాలా మంది భావించేది ఇదే. కానీ పొలిటిషియన్స్‌కు కూడా మనలాంటి సాధారణ ప్రజలే, వారికి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. మరీ ముఖ్యంగా నేటితరం రాజకీయ నాయకులు..

Watch Video: ఎప్పుడూ రాజకీయాలేనా బ్రో.. ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేసిన ఎంపీ అర్వింద్‌. నెట్టింట వైరల్‌..
Arvind Dharmapuri
Narender Vaitla
|

Updated on: Dec 05, 2022 | 9:09 AM

Share

రాజకీయాల నాయకులంటే ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలు.. చాలా మంది భావించేది ఇదే. కానీ పొలిటిషియన్స్‌కు కూడా మనలాంటి సాధారణ ప్రజలే, వారికి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. మరీ ముఖ్యంగా నేటితరం రాజకీయ నాయకులు కేవలం రాజకీయానికి పరిమితం కావడం లేదు. సినిమాలు, స్పోర్ట్స్‌ ఇలా ప్రతీ అంశంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. తమకు ఏమాత్రం ఆసక్తి కలిగించే అంశం కనిపించినా వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. పొలిటిషియన్స్‌ పోస్ట్‌ చేయడంతో సదరు వార్తలకు మరింత క్రేజ్‌ వస్తోంది.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే షేర్‌ చేశారు బీజేపీ నాయకుడు, నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. గత కొన్ని రోజుల నుంచి ఓ పెళ్లి బరాత్ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పెళ్లి బరాత్‌లో బ్యాండు మేళం వాయించే వారికి టిప్‌ ఇస్తుండడం సర్వసాధారణమైన విషయం. డ్యాన్స్‌ చేస్తున్న వారి చుట్టూ డబ్బులు తిప్పి టిప్‌గా ఇస్తుంటారు. అయితే డిజిటల్‌ పేమెంట్స్‌ విస్తృతి పెరిగిన తర్వాత అన్నీ పేమెంట్స్‌ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. మరి తమ టిప్‌ కూడా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందేమో.. బ్యాండ్‌ మేళం వాయించే వారు తమ బ్యాండ్‌లకు తమ యూపీఐ స్కానర్‌ స్టికర్లను అంటించారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తాజాగా ఎంపీ అర్వింద్ ఇదే వీడియోను షేర్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా వీడియోను షేర్‌ చేసిన అర్వింద్‌ ‘పెళ్లిలో ‘డిజిటల్‌’షగుణ్‌’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో మరోసారి నెట్టింట సందడి చేస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ నుంచి ఈ వీడియోను తీసుకున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!