AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Distance: కరోనా కాలం..సామాజిక దూరం తప్పదు మరి..ఓ వరుడి సైకిల్ పై బారాత్..ప్రజలను ఆకట్టుకుంది!

కరోనా వైరస్ తొ పెరుగుతున్న నష్టాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాల్లో కఠినమైన నియమాలు అమలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలలో, ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Social Distance: కరోనా కాలం..సామాజిక దూరం తప్పదు మరి..ఓ వరుడి సైకిల్ పై బారాత్..ప్రజలను ఆకట్టుకుంది!
Marriage In Corona Pandemic
KVD Varma
|

Updated on: Apr 26, 2021 | 10:11 PM

Share

Social Distance: కరోనా వైరస్ తొ పెరుగుతున్న నష్టాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాల్లో కఠినమైన నియమాలు అమలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలలో, ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఈ కరోనా కల్లోలంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తక్కువ మంది బంధువుల మధ్యలో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. అంతకు మించి ఆడంబరంగా జరుపుకునే అవకాశం లేదు. కానీ, చాలా చోట్ల ఇదీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఊరేగింపుగా వధువును వరుడు తీసుకువెళ్ళే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒక వరుడు.. సొంత బరాత్ ను సైకిల్ పై జరుపుకున్నాడు. వధువుతో ఏడడుగులు వేయడానికి సైకిల్ పై వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్ లో వినయ్ కుమార్ తన వధువును తీసుకురావడానికి సైకిల్ తీసుకున్నాడు. బోజి గ్రామంలో నివసించే వినయ్ తన బారత్ (ఊరేగింపు) కోసం తన స్నేహితులతో కలిసి రాజ్‌గడ్ గ్రామానికి వెళ్లారు. ఈ ఊరేగింపులో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పాల్గొన్నవారు అందరూ సైకిల్ తొక్కడంతో పాటు ఫేస్ షీల్డ్ అలాగే ఫేస్ మాస్క్ ధరించారు. అతను కారులో వెళ్ళలేడని కాదు, కరోనావైరస్ గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నందున వినయ్ అలా చేశాడు. కేవలం కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను చెప్పడం కోసమే ఈ సైకిల్ బారత్ చేసినట్టు ఆ వరుడు చెప్పాడు.

నిజానికి వినయ్ కుమార్ ఓ పర్యావరణ కార్యకర్త. సామాజిక దూరం పాతిన్చండం అందరి విధి అనే సందేశాన్ని నా పెళ్లి సందర్భంగా ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఇలా సైకిల్ పై బరాత్ ఏర్పాటు చేశాను. బస్సుల్లోనో.. కార్లలోనో ఈ పని చేస్తే నేను సామాజిక దూరం అంశాన్ని చెప్పలేక పోయేవాడిని అని వినయ్ చెప్పారు.

ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, వరుడు వినయ్ కుమార్ బరాటీలతో సైకిళ్ళపై వధువు గ్రామానికి చేరుకున్నప్పుడు, స్థానికులు అతనిని ఎగతాళి చేయకుండా ప్రశంసించారు. ఈ ప్రత్యేకమైన ఊరేగింపు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు దీన్ని ఒకరికొకరు పంచుకోవడమే కాదు, దానిపై వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read: Eye Care: కంట్లో చుక్కల మందు అనుకుని..జిగురు చుక్కలు వేసేసుకుంది..తరువాత ఏం జరిగిందంటే..

Leaf Bag: సరికొత్త ఫాషన్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.. చాల్చాల్లే ఇలాంటివి చాలా చూశాం అని గాలి తీసేశారు నెటిజన్లు!